హెడ్డింగు చూసేసరికే తెల్సిపోతుందిలెండి దేనిగురించి రాస్తున్నానో...ఇలాంటివి ఇంతకముందు తోటి బ్లాగర్లు రాస్తే చదివి పళ్ళికిలించినవాళ్ళల్లో నేనూ ఒకర్తిని...నేనూ అవి రాసే రోజు వచ్చేసింది...:(
ఎప్పుడో పూర్వకాలం లో తప్ప ఈ మధ్య కాలంలో ఎప్పుడూ మెరుపుతీగలా లేకపోయినా ఫరవాలేదు అంత లావేం కాదు లానే వుంటానని నా ప్రగాఢమైన వుద్దేశం...నా కంటికైతే అలానే అనిపిస్తాను మరి...మనలో మన మాట కాస్త eye site వుంది లెండి ఆ కంటికి...
కొత్త project లోకి వచ్చాక...ఇక్కడ నా colleague తమిళ తంబి...after you came here you have put on weight అన్నాడు ఆ మధ్య...వీడికి నేనంటే కుళ్ళు...అన్నింట్లో నాతో పోటీ కావాలని ఏడిపిద్దామనే అంటున్నాడు అని తేలిగ్గా తీస్కున్నా...రెండు రోజులకే నాతో పోటీలూ...పోలికలూ పెట్టుకునే పనిలేని ఇంకో colleague కూడా అనేశాడు అదే మాట...అప్పుడు కాస్త గుండె ఖలుక్కు మంది.
ఇంక కొత్తగా మా ఇంట్లో చేరిన అమ్మాయి ఐతే ..ఆ పిల్ల రివటలా సన్నంగా పొడుగ్గా వుండి ఇంకా తెగ బాధ పడిపోతోంది నేను లావుగా వున్నా అని...పాపం వోదారుద్దామని నువ్వేమంత లావు వున్నావు చక్కగా సన్నంగా (పుల్లలా) వుంటేనూ అంటే...నీతో పోల్చుకుంటే సన్నమే లే అనేసింది...అలా అన్నందుకు ఏమీ ఫీలు కూడా అవ్వలేదు పై పెచ్చు...అప్పుడు కాస్సేపు హతవిధీ...ఎంతటి పరాభవం....నేను ఆ పిల్ల వున్న ఇంట్లోనే ఎందుకు వుండవలె...వుంటిని ఫో...నా గోల చూసుకోక ఆ పిల్లని వోదార్చాలని ఎందుకనుకోవలే...అని కాస్సేపు వగచి...రోదించి...తర్వాత అలోచించా...ఏవిటి నా తక్షణ కర్తవ్యం అని...
ఎన్నాళ్ళు(ఎన్నేళ్ళు) గానో వాయిదా వేస్తూ వచ్చిన gym మరియు diet plan అమల్లోకి తీసుకురావలసిందే అని గాఠ్ఠి నిర్ణయానికి వచ్చా...
పొద్దున్న పూట regular break fast కార్న్ ఫ్లేక్స్ లేకపోతే multy grain bread...లంచ్ కి cracked wheat(ఎర్ర గోధుమ) రెండు చెంచాలు మాత్రమే నూనె బోలెడన్నీ కూరగాయలు వేసి చేస్కున్న వుప్మా(లాంటిది)...సాయంత్రం ఆఫీసునుంచి వచ్చాక కాస్త ఫల హారం(ఫల హారం పేరు పెట్టి snacks లాగించటం కాదు. అచ్చంగా ఫలాలే) తర్వాత ఒక అరగంట జిమ్ము. మొదట్లో పావుగంటకే నీరసం...అయాసం అవేశం అన్నీ వచ్చేసేవి కానీ ఈమధ్య ఫరవాలేదు కాస్త...రాత్రికి వోటు మీలు...ఈ వోటు మీలు దగ్గరే చిక్కంతా...ఒక రెండేళ్ళ క్రితం ఇలాగే ఆవేశం వచ్చి ఒక నెల పాటు వదలకుండా వోట్లే భోంచేసి అవంటే రోత పుట్టి వదిలేశాను...మళ్ళీ ఎప్పుడు తిందామన్నా వాంతి వచ్చినంత పనయ్యేది. మొదటి రోజు మహా sincere గా వోటుమీల్ లో మజ్జిగ మాత్రం పోసుకుని తిన్నానా...కళ్ళల్లో నీళ్ళొక్కటే తక్కువ. మర్నాడు కాస్త ప్రియా పచ్చడి జోడించే సరికి ఆహా భూ ప్రపంచం మీద మహా రుచికరమైన వస్తువుల్లో ఒకటనిపించిందంటే నమ్మండి. ఆ తర్వాత కాస్త కూర ముక్కలు...ఒక రోజు కాసింత పచ్చడి, ఇన్ని కూర ముక్కలూ ఇలా రకరకాల combination లతో బాగానే నెట్టుకు రాగలుగుతున్నా...వోటు మీలు ప్రయత్నిద్దామనుకునే వాళ్ళకి ఇదే నా వుచిత సలహా మొదటి రోజు వుట్టి మజ్జిగతోనే తినండి...రెండో రోజు నుంచి ఇలాంటి ప్రయోగాలు మొదలెడితే అదే వోటుమీలు దివ్యంగా అనిపించక మానదు..నా diet plan ఇంత సవివరం గా ఎందుకు రాస్తున్నా అంటే నాలాంటి ఔత్సాహికులు చూసి follow అవ్వొచ్చుకదా పాపం అని...దీనిమీద ఎటువంటి copy right నిబంధనా లేదొహో ఎవ్వరైనా వాడుకోవచ్చని బ్లాగ్ముఖంగా తెలియజేస్తున్నా...
ఈ time table ఒక రెండు వారాలు చిన్న చిన్న అవరోధాలతో బాగానే నెట్టుకొచ్చేసాను...కానీ అప్పుడే మొదలైంది కహానీ మె twist...నా తిండి, నా దీక్ష చూసి నన్ను ఏడిపించడం లో ఎటువంటి మినహాయింపు ఇవ్వని మా వారూ, నన్ను అంతగా అవమానించిన నా roomie తో సహా అందరూ తెగ బాధ పడిపోవటం మొదలెట్టారు. అయ్యో పాపం ఏమీ తినదు...రోజూ అదే ఎలా తింటావ్. అస్సలు అన్నమే తినవా అని ఒకటే అంగలార్చెయ్యటం. వాళ్ళ స్నేహితులెవరైనా ఇంటికొస్తే ఒక విచిత్రాన్ని పరిచయం చేసినట్టు "ఏ లడ్కీ కుచ్ భీ నహీ ఖాతీ...పతా నై rice ఖాయే బినా కైసే జీతీ హై" అని వాళ్ళకి చెప్పడం...వాళ్ళంతా ఇంత కళ్ళు చేస్కుని museum లో బొమ్మని చూసినట్టు చూడటం. పైగా ఆఫీసు నుంచి నేను వచ్చేసరికే ఘుమ ఘుమా వాసనలు వెదజల్లుతూ రోజుకొక కొత్త వంటకం వండుకోవటం. రా కొంచెం తిను కొంచెం తింటే ఏమీ అవ్వదులే అని ఏడిపించటం..మొదట్లో నా రూములోకి వెళ్ళి తలుపేసుకుని control...control అని తపస్సు చేసేదాన్ని కానీ ఈ మధ్య ఫర్వాలేదు వాళ్ళు ఓ పక్క వంట చేస్తుంటే కూడా నేను అవి చూసి...చీ అంత నూనె పోసుకుని ఎలా తింటారో అనుకుంటూ హాయిగా నా వోట్లు తినగలుగుతున్నా...నాకిప్పుడివే రుచి గా అనిపిస్తున్నాయి. తినగ తినగ వేము తియ్యన...సాధనమున పనులు సమకూరు ధరలోన...ఇలాంటి సూక్తులన్నీ వూరికే రాసారా మహానుభావులు...
ఇంతకీ ఈ సుత్తి అంతా ఇక్కడ రాయటానికొక బలమైన (బరువైన కాదు...మీ కళ్ళకలాగే కనిపిస్తుంది నాకు తెలుసు) కారణం వుంది...సిగరెట్టు మానేసేటప్పుడు పదిమందికి చెప్పి మానెయ్యలట...మళ్ళీ కాలిస్తే వాళ్ళు చూసి అడిగితే ఏం చెప్తాం అన్న భయం వల్లైనా మానేస్తారని...అలాగే నా దీక్షా, పట్టుదలా చూసి వోర్వలేక నన్ను నిరుత్సాహ పరిచే వాళ్ళ మాయలో పడకుండా...ముఖ్యం గా కొత్తావకాయ లాంటి వాళ్ళ బ్లాగుల్లో రాసే ఇలాంటి టపాలు చదివేసి నా దీక్ష మధ్యలో విరమించకుండా మీరంతా కూసింత support ఇస్తారనీ...హన్నా అదే మరీ... మీరు అలా అయ్యో అన్నమే తినవా లాంటి డవిలాగులు వేస్తే అస్సలు బాగోదు ముందే చెప్తున్నా
7 comments:
హహ్హహా.. మిమ్మల్ని చూసి నవ్వట్లేదండోయ్.. తిట్టుకోకండి. మీకో దేవ రహస్యం చెప్తా వినండి. అలాంటి రుచికరమైన రాతలు రాసేవాళ్ళంతా ఇంచుమించు మీలాంటి డైట్ ప్లాన్లో విసిగివేసారుతున్నవాళ్ళే. @$#%&* జీవితం అనిపించి నాస్టాల్జియా లోకి వెళ్ళి "అప్పుడది తిన్నా.. ఇప్పుడిది తిన్నా " అని డంభాలు పలుకుతున్నారంతే. రాసినది కోటా శ్రీనివాసరావు లాగ ఎదురుగా పెట్టుకొని మొలకెత్తిన పెసలు నిర్వికారంగా నములుతూ ఉంటారన్నమాట. మీరూ అదే చెయ్యకూడదూ! బుజ్జి నా జీవితంలో మిమ్మల్ని కలిస్తే మటుకు దాసురాలి తప్పులు పీజా తో సరి. మాంచి పార్టీ చేసుకుందాం. :)
మంచి టపా. తిట్టుకుంటూ అయినా తలుచుకున్నందుకు ధన్యవాదాలు.
హ హ భలే రాసారు :) (అంటే మీరు కష్టాలకి అలవాటు పడిపోయారు కదా అని నవ్వేసానన్న మాట)
మీకు నా ఫుల్ సపోర్ట్ :))))
స్పురిత గారు - కికికికికికికికికికికి...
సారీ..సారీ..ఇంక నవ్వను..కానీ నవ్వొస్తోంది..!!
మీ దీక్ష సక్సెస్ కావాలని కోరుకుంటూ - కిరణ్ (చిన్నగా..మీకు వినపడకుండా నవ్వుతు ..:P)
స్ఫురిత ది బ్లాగర్ గారు, అన్నం మానెయ్యడం మంచిదే కాని ఆ oats మాత్రమె తిని గడిపెయ్యడం వుంది చూడు అది మాత్రం మంచిది కాదు. నీకు తెలుసు కదా నీకో ఫ్రెండ్ ఉండేదని ,, పెళ్ళయ్యాక కనిపించిన కొండలు గుట్టలు ఎక్కేసి(అదేలే ఇంగ్లీష్ లో hiking అంటారు) నా నా రకాల dieting లు చేసేసి సన్నబదిందని కాస్త దానికి కాల్ చేసి ఎలా చేస్తే విసిగి పోకుండా వుంటుందో కనుక్కో లేకపోతే విసుగు వచ్చిన ఎం చెయ్యాలో తెలీక బ్లాగ్ లో అనౌన్స్ చేసినందుకు మానలేక, అలాగని తినలేక అనవసరంగ బాధపడాలి. నీ రాతలు అయితే చాల బావున్నాయ్.
hahaha...nenu kooda konni rojula kritam dieting modalupettanandi..nijamgaane andaru annam tintunte edupu vastundi.
mukhyamgaa evening snacks, burger, samosa, mirchi bajji...anni chaala miss auntunnanu.. :(
sorry avanni gurtu chesinanduku... :)
మొదట్లో కష్టంగా ఉన్నా డైటింగ్ నెమ్మదిగా అలవాటై పోతుందండీ.. భలేగా రాశారు..
:)). ఈసారి మిమ్మల్ని గుర్తు పట్టలేనేమో, పాత ఫొటో తీసుకురండి
Post a Comment