వాళ్ళ నాన్న గారి చిటికెన వేలు పట్టుకుని బజార్లో అది కావాలీ...ఇది కావాలి అని పేచీలు పెడుతున్న బుల్ల్లి బావ, ఇంకా నాన్నగారి మనసులో మెదులుతూనే వున్నాడు...
నాన్నతో పాటు పెళ్ళి చూపులకొచ్చిన చిట్టి అల్లరి పిడుగు, అమ్మ కళ్ళల్లో ఇంకా కదులుతూనే వున్నాడు...
నీ పేరేవిటే 'స్ఫురించడం' లేదూ అంటూ ఆటపట్టించే తన మాటలు గుర్తొచ్చినప్పుడల్లా ఇంకా పెదవులమీద చిరునవ్వులు పూయిస్తూనే వున్నాయి...
నా పెళ్ళికి అడక్కుండానే రెండు రోజుల ముందు సెలవు పెట్టుకుని వచ్చి...నీకు సాయం చేద్దామని ముందే ఇంటికి వచ్చా బావా అని ఫోన్ చేసి చెప్పినప్పుడు నాన్న కళ్ళల్లో నేను చూసిన ఆనందం, ధైర్యం ఇంకా నా జ్ఞాపకాల్లో సజీవంగా అలానే వున్నాయి...
ఎవరి పనుల్లో వాళ్ళు పడి చెల్లాచెదురైపోయిన బంధువులందర్నీ ఒక చోటకి చేర్చి ఫామిలీ రీయూనియన్ అని తను చేసిన సందడి అందరి గుండెల్లో ఇంకా భద్రంగానే వుంది...
మెరుపులా ప్రత్యక్షమయ్యి...నాకోసమేనా అక్కా పకోడీలు చేస్తున్నావ్ అని చనువుగా వంటింట్లో అమ్మని పలకరించేసి...నాన్నతో నాలుగు కబుర్లు చెప్పేసి...ఫోన్ లో నన్ను పలకరించేసి అప్పటివరకూ వుదాసీనం గా వున్న మా మనసుల్లో వుత్సాహం నింపేసి...ఏదో పని గుర్తొచ్చిందంటూ చటుక్కున మాయం అయిపోయే ఆ అనుకోని అతిధి పలకరింపులు, ఇంక కనపడవని నమ్మడానికి వొప్పుకోనని మనసు మొరాయిస్తోంది...
తను ఈ ప్రపంచం తో సంబంధం తెంచేసుకుని పదిరోజులు దాటిపోయినా ... ఎప్పుడూ నవ్వుతూ పలకరించే తన గొంతు మా చెవుల్లో పదిలంగానే వుండిపోయింది...పైకి వేలాకోళాలాడినా... తన మాటల వెనక వున్న అభిమానం మా గుండెల్లో చెక్కు చెదరకుండా అలాగే వుంది...
మరణం మనిషితో పాటూ ప్రాణం ఒక్కటే తీస్కుకుపోతుందా అంటే...కొందరి జీవితాల్లో సంతోషం, నమ్మకం, ఆసరా కూడా ఆ ప్రాణం తనతో పాటూ లాక్కెళ్ళిపోతుంది...కొందరు మనుషులు మాత్రం...మృత్యువుకతీతంగా తమదైన ముద్ర తోటివారికి విడిచిపెట్టి మన మధ్యలోనుండి చెప్పకుండానే మాయమైపోయినా... మనసు పొరల్లో గూడు కట్టుకుని మన చుట్టూనే తిరుగుతూ వుంటారు...
నువ్వు మా మధ్య లేకపోయినా, వున్నన్నాళ్ళూ నవ్వుతూ నవ్విస్తూ చేతనైన సాయం చేస్తూ బతకాలని... 'నన్ను చూసి నేర్చుకో' అని నోటితో చెప్పకుండానే ...జీవించి చూపించి నువ్వు ఇచ్చిన స్ఫూర్తి మాతో ఎప్పటికీ వుండిపోతుంది....
(పది రోజుల క్రితం రోడ్ యాక్సిడెంట్ లో మరణించిన మా శర్మ మావయ్యకి శ్రద్ధాంజలి...ఆయన కుటుంబానికి...ఈ లోటుని తట్టుకునే శక్తి ని, ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ...)