4/13/10

నా కళా పోషణ

చిన్నప్పుడు నేను ఎక్కడైనా కాగితం కనబడితే చాలు బొమ్మలు వేసేస్తూ
వుండేదాన్ని. మా అమ్మ చేత అక్షింతలు కూడా వేయించుకుంటూ ఉండేదాన్ని తెల్ల
కాగితాలన్నీ తగలేస్తున్నానని. Computer చూడగానే నాకు అందులో నచ్చినది
Paint Brush. కాగితాలు వృధా కాకుండా ఎన్ని బొమ్మలైనా వేస్కోవచ్చుకదా
అన్నదే నాకు Computer గురించి పెద్దగా ఏమీ తెలియనప్పుడే తెలిసిన మొదటి
ఉపయోగం. తర్వాత్తర్వాత ఆ మహాసముద్రం లోనే ఈదుతున్నా ఇప్పటికీ ఆ బొమ్మలు
వేసే అలవాటు పోక(మా అమ్మ భాష లో పైత్యం)అప్పుడప్పుడూ, ఇంకా చెప్పాలంటే ఈ
Computer కనిపెట్టినవాడు కనపడితే కాల్చి పారెయ్యాలి అనిపించినప్పుడు ఒక
బొమ్మ వేసి Save చెస్తూ వుంటాను.

నాకు ఇవాళ మధ్యాహ్నం ఒక మహత్తరమైన అలోచన(నా దృష్తిలో)వచ్చింది.
బ్లాగ్లోకం వున్నది మన కళల్ని ప్రపంచానికి చాటడానికే(ప్రపంచం మీద
రుద్దడానికే) కదా అని. రావటమే తణువు నా చిత్రకళా ప్రదర్శన
పెట్టేస్తున్నా. ఇక మీదే అలశ్యం.

గమనిక: ఫ్రవేశం వుచితం.


మురళీ గానామృతం



కన్నీళ్లు కూడా వరమే


దారిచూపే దివ్వె








వెన్నెల్లో ఆడపిల్ల



పూజలు సేయ పూలు తెచ్చాను...


దీపావళి వెలుగులు
హమ్మయ్య అయ్యారిరా బాబూ అనుకుంటున్నరా...అక్కడే పప్పులో కాలేసారు...ఇంకా చాలా వున్నాయి. ఇది మొదటి భాగం మాత్రమే...మళ్ళీ కలుద్దాం త్వరలో.