2/1/21

నువ్వు ఎవరు..? - Search continues


 

కొన్ని అభిప్రాయాలు

మార్చాలనే ప్రయత్నం


కొంతమంది దృష్టిలో 

పడాలన్న తపన


కొన్ని ఆలోచనల్లో

మిగిలిపోవాలనే తాపత్రయం


కొందరి మీదయినా మన ముద్ర

చెరగకుండా వుండాలనే ఆశ


ఇవన్నింటినీ కలిపి తీసేసాకా

మిగిలిన "నీ" విలువని

శూన్యం అనాలా...?

పూర్ణం అనాలా...?



1/25/21

నువ్వు ఎవరు?

 


 

నువ్వు ఎవరు?


ఓహో తనా
చాలా నెమ్మది... అసలు మాటే వినపడదు

 

అమ్మో తనా
పెద్ద మొండి ఘటం

 

అయ్యో తనా
పాపం చాలా వోపిక

 

అమ్మో తనా
ఎంత పొగరో

 

ఒక అభిప్రాయం
ఒక ఆలోచన
ఒక దృష్టి కోణం
ఒక ముద్ర

 

వీటన్నిటినీ మించి నువ్వు ఎవరు...?

ఆ తను మైనస్ నువ్వు ఎవరు...?