కొన్ని అభిప్రాయాలు
మార్చాలనే ప్రయత్నం
కొంతమంది దృష్టిలో
పడాలన్న తపన
కొన్ని ఆలోచనల్లో
మిగిలిపోవాలనే తాపత్రయం
కొందరి మీదయినా మన ముద్ర
చెరగకుండా వుండాలనే ఆశ
ఇవన్నింటినీ కలిపి తీసేసాకా
మిగిలిన "నీ" విలువని
శూన్యం అనాలా...?
పూర్ణం అనాలా...?
నా రాతలు
నాకు తోచినవి...నాకు నచ్చినవి...
2/1/21
నువ్వు ఎవరు..? - Search continues
1/25/21
నువ్వు ఎవరు?
నువ్వు ఎవరు?
ఓహో తనాచాలా నెమ్మది... అసలు మాటే వినపడదు
అమ్మో తనాపెద్ద మొండి ఘటం
అయ్యో తనాపాపం చాలా వోపిక
అమ్మో తనాఎంత పొగరో
ఒక అభిప్రాయంఒక ఆలోచన
ఒక దృష్టి కోణంఒక ముద్ర
వీటన్నిటినీ మించి నువ్వు ఎవరు...?ఆ తను మైనస్ నువ్వు ఎవరు...?
12/29/20
మనసు పలికే...
![]() |
ముందురోజు మొత్తం మెడికల్ కాంప్ లో పనిచేసి అలిసిపోడం వల్ల అతను మాట్లాడుతున్నది తనతోనే అని తెలుస్తున్నా కనురెప్పలు పైకి లేవడానికి ససేమిరా అన్నాయి. కాస్సేపు అలాగే బధ్ధకంగా కిటికీకి తలవాల్చికూచుండిపోయింది. అటుగా వెళుతున్న పిల్ల తెమ్మెర చెంపలు నిమిరి పలకరించి వెళ్ళింది. ఆ స్పర్శతో ఏదో పరిచయమున్నట్టనిపించి కళ్ళు విప్పి చుట్టూ చూసింది కిరణ్.
ఆ పరిసారాలు కూడా తనకి బాగా తెలుసున్నట్టనిపించాయి. నెమ్మదిగా వాన్ దిగి, చుట్టూ చూస్తూ అందరూ కూచుని వున్న పాక హోటల్ వైపు నడిచింది. ఒక పక్కగా వున్న టేబుల్ దగ్గర కూచుని కాఫీ చెప్పింది. తన కేసి పలకరింపుగా వొకసారి చూసి మిగిలిన స్టాఫంతా ఎవరి కబుర్లల్లో వాళ్ళు మునిగిపోయారు.
చుట్టూ చూస్తూ కాఫీ సిప్ చేస్తుంటే, రోడ్డుకవతలి వైపు చిన్న బస్ స్టాప్, సూరయ్య దంపతుల జ్ఞాపకార్ధం అని సగం చెరిగిన అక్షరాలు. ఆ పేరు తనకి బాగా పరిచయమే. కోపమొచ్చినప్పుడల్లా రవిని సూరయ్యా అని పిలిచేది కదూ. అలా పిలిచినప్పుడల్లా, ఎర్రగా మారిపోయే రవి మొహం గుర్తుకొచ్చి తనకి తెలియకుండానే పెదాలు సన్నగా విచ్చుకున్నాయి.
ఆ బస్ స్టాప్, ఆ వూరూ కూడా తనకి పరిచయమే అన్న విషయం మనసులో మెదలగానే, పెదవులమీద చిరునవ్వు కాస్తా మాయమయ్యింది. సుగర్ లెస్ కాఫీ లో చేదు ఇప్పుడు బాగా తెలుస్తోంది.
*****
దాదాపు పదేళ్ళై వుంటుంది. కిరణ్ రవి చేతిలో చెయ్యి కలిపి ఇదే బస్ స్టాప్ లో బస్ దిగింది. ఐదేళ్ళ స్నేహాన్ని ఎప్పటికీ విడిపోని బంధం గా మార్చుకోవాలని ఇద్దరి కళ్ళల్లో కలలు. ఎప్పటికీ నీ కలలకి తోడుంటా అని మాటిస్తూ వెచ్చగా నొక్కుతున్న రవి చేతి స్పర్శ. నీకింక అన్నింటిలో తోడుంది... ఏ భయం లేదు, అని కిరణ్ మనసు గట్టిగా చెబుతోంది.
రెండవ రోజు, అదే బస్సు తిరిగి వెళ్ళే వేళకి కిరణ్ ని బస్ ఎక్కించడానికి వచ్చాడు రవి. ఇద్దరూ చెరో వేపూ చూస్తున్నారు. మాట్లాడాలి. కానీ ఎలా మాట్లాడాలో, ఎలా మొదలెట్టాలో ఎవరికీ తెలియడం లేదు. ఇన్నేళ్ళ పరిచయంలో ఇంత సేపు ఇద్దరూ మౌనంగా వున్న సందర్భం ఎప్పుడూ రాలేదు. బస్ రావడానికి ఎంతసేప్పడుతుందీ అని పక్కనే వున్న కిళ్ళీ కొట్టులో అడిగి వచ్చాడు రవి.
ముందుగా రవే నోరు విప్పాడు.
"నువ్వు మా ఇంట్లో వుండలేవు కిరణ్. మనిద్దరి వూహలూ, కలలూ వొకటే అనుకున్నాం. కానీ ఇద్దరి దారులూ కలవడం కష్టం."
ఈ మాటలు చెప్పి ఎటో చూస్తున్నాడు రవి.
తనూ ఇంచు మించు ఇదే చెప్పాలనుకుంది, కానీ అవే మాటలు రవి నోటి వెంట వినడం కష్టంగా అనిపించింది.
**************************
రవి తండ్రి ఆ వూరి సర్పంచ్. వూరిని చాలా బాగా చూసుకుంటాడని పేరు. ఇరవై ఏళ్ళుగా ఎప్పుడూ ఏకగ్రీవంగా ఎన్నికవడమే ఆనవాయితీ. అది రవి తాత గారినుంచి కొనసాగిన వారసత్వం.
ఆ వూళ్ళో బస్ స్టాప్ మీదున్న సూరయ్యగారే, రవి తాతగారు.ఆ పేరునే రవి అని మార్చి తాత పేరు పెట్టారు.
రవి తన తండ్రి గురించీ, ఆయన పలుకుబడి గురించీ చెప్పే కబుర్లు విని, పెద్ద జమీన్దార్ లా వుంటారనీ, పెద్ద ఇల్లూ, ఇంటినిండా పని వాళ్ళూ, అంతా కోలాహలం గా వుంటుందని కాస్త బెరుకుగా అనిపించేది కిరణ్ కి.
కానీ రవి ఇల్లు చాలా మామూలుగా వుంది. అమ్మా నాన్నలూ మామూలుగానే వున్నారు. రవీ వాళ్ళమ్మ కిరణ్ ని చాలా బాగా పలకరించారు. వాళ్ళ నాన్నగారు రిజర్వుడుగా వున్నారనిపించింది.
రోజంతా వూరు చూడ్డం, వూరివంటలు రుచి చూడ్డంతో సరదాగానే గడిచిపోయింది.
రాత్రి కరెంటు పోయి నిద్ర పట్టక, డాబా పైకి చేరి పచార్లు చేస్తోంది కిరణ్. చుట్టూ చీకటి.
కింద వాకిట్లో, రవి తండ్రి మంచం వాల్చుకుని కూర్చుని వున్నారు. తల్లి, అరుగుమీద లాంతరు వెలుగులో ఏవో ఆకు కూర వొలుస్తూ కూచుంది. ఆమె పక్కనే రవి.
"పిల్ల కళగా వుంది కదండీ..." రవి తల్లి గొంతు.
పక్కవాళ్ళ మాటలు చాటుగా వినకూడదు అన్న మర్యాద కాస్త పక్కకి జరిపి అక్కడే నిలబడింది.
"ఆ పిల్లని పెళ్ళిచేస్కుందావనుకుంటున్నావా రా...?" రవి తండ్రి ఏ ఉపోద్ఘాతంతో పని లేకుండా విషయంలోకొచ్చేసారు.
"అవును నాన్నా. మీకు చూపిద్దామనే తీసుకొచ్చాను. తనంటే నాకు చాలా ఇష్టం." రవి కూడా ఏమీ మొహమాట పడలేదు.
"నువ్వు పట్నం వెళ్ళి పై చదువులు చదువుతానంటే, నేనడ్డెట్టలేదు. కానీ నువ్వు పట్నం లోనే వుంటానంటే వొప్పుకోలేను. మా బాబు తరవాత నేనెలాగ వూరి పగ్గాలు తీసుకున్నానో, నా తరవాత నువ్వూ అలాగే ఈ వూరి బాగోగులు సూసుకోవాలని నా ఆశ. నీ సదువు కూడా ఈ వూరి బాగుకే వుపయోగపడాల."
"తను డాక్టరైనా కానీ తనకి పట్నాల్లో వుండాలని లేదు నాన్నా. చిన్న వూళ్ళల్లో జనాలకి అందుబాటులో వుండాలనే అనుకుంటోంది. తన చదువు కూడా మన పల్లెకి...." రవి మాట పూర్తి కాకుండానే, రవి తండ్రి లేచి నుంచున్నాడు.
"మన ఇంటి కోడలు ఏనాడు గడపదాటి వూళ్ళో తిరగలేదురా. అది ఇప్పుడు జరగడం నాకిష్టం లేదు. తనూ నీతో పాటు ఈ వూరొచ్చి, అమ్మలాగానే ఇంటిపట్టున గుట్టుగా సంసారం చేస్తుందీ అంటావా నాకే అభ్యంతరం లేదు." వేరే ఏ చర్చకీ అవకాశం ఇవ్వకుండా కండువా దులిపి ఇంట్లోకి నడిచాడాయన.
కరెంటు వచ్చేసరికి, రవి తల్లి ఆకుకూర పళ్ళెం పట్టుకుని భర్త వెనకాలే లోపలకి వెళ్ళిపోయింది, తను చెప్పడానికి వేరే అభిప్రాయాలేవీ లేవని తేల్చేస్తూ. అక్కడే కూచున్న రవి మొహం లో ఏం రంగులు మారుతున్నాయో డాబా మీదకి కనపడలేదు.
వూరంతా దీపాలు వెలుగుతున్నాయి. కిరణ్ మనసులో మాత్రం మొత్తం శూన్యం.
****
హారన్ శబ్దానికి వులిక్కి పడి చూసింది. రవి అప్పటికే తన బాగ్ బస్ లో పెట్టేశాడు. మౌనంగా బస్ ఎక్కి కూచుంది. వీడుకోలు చెప్పడానికి వచ్చిన వాళ్ళు కిటికీల్లో కి చేతులు జాపి మరీ జాగర్తలు చెపుతున్నారు. తను రవి కేసే చూస్తోంది. రవి మాత్రం జేబులో చేతులు పెట్టుకుని దిక్కులు చూస్తున్నాడు. కిరణ్ మాత్రం చూపు తిప్పకుండా అతన్నే చూస్తోంది. అతనింకా ఏం చెప్పాలని మనసు ఆరాట పడుతోందో మాత్రం తనకే అర్ధం కావడం లేదు.
కాబోయే అత్తా, మామలని పరిచయం చేస్తానని ఆ వూరు తీసుకొచ్చేముందు చెప్పాడు. తనని మాత్రం వాళ్ళకి కోడలిగా పరిచయం చెయ్యలేకపోయాడు.
నెమ్మదిగా రవి రూపం మసకబారిపోతోంది. ఇంక ఈ ప్రయాణంలో తను వంటరిదే, నీకు నువ్వే తోడు అని రెండు చేతులు కలిపి బిగించి గట్టిగా వూపిరి తీసుకుంది.
****
కప్పులో కాఫీ ఐపోయింది. చేదు రుచి నాలిక మీదే మిగిలిపోయింది.
దూరంగా బుల్లెట్ మీద వచ్చేది.. అతనేనా? తనలాగే వున్నాడు.
అప్పట్లో ఎప్పుడూ బ్రాండెడ్ బట్టల్లో వుండేవాడు. ఇప్పుడు మామూలు పాంటూ, షర్టూ. రూపం లో పెద్ద మార్పేవీ రాలేదు. చూస్తుండగానే దూరం తగ్గి దగ్గరయ్యింది. బండి వెనకాల, వ్యాన్ డ్రైవర్.
బండి దిగి డ్రైవర్, కిరణ్ దగ్గరకొచ్చి చెపుతున్నాడు.. మెకానిక్ షాపులో ఇలా మెడికల్ క్యాంపు నుంచి వస్తుంటే బండి వూరిపొలిమేరల్లో ఆగిపోయిందని సెప్పానమ్మా, ఈ వూరి సర్పంచ్ గారికి డాక్టర్లంటే చాలా గౌరవమని సెప్పి, షాపులో కుర్రోడినిచ్చి ఆయన్ని కలవమని పంపాడమ్మా. విసయం సెప్పగానే, బండి బాగయ్యేదాకా మనందరికీ వసతి ఏర్పాటు సెయ్యడానికి ఆయనే సొయంగా వొచ్చేరమ్మా. సంబరంగా చెప్పుకుపోతున్నాడు డ్రైవర్.
ఎక్కడ బస ఏర్పాటు చెయ్యాలి, భోజనాలెవరింట్లో చూడాలి అని తన వెనకే వచ్చిన వ్యక్తికి పనులప్పగిస్తున్నాడు రవి.
తనని గుర్తుపట్టాడో లేదో, లేక చూసి చూడనట్టు తప్పుకుంటున్నాడో అర్ధం కాక అతన్నే గమనిస్తోంది కిరణ్.
పదండమ్మా, ఇక్కడ దగ్గర్లో వొక ఇంట్లో కాస్సేపు రెస్టు తీసుకుందాం అని నర్సు వచ్చి పిలిచేవరకూ అతని వెంటే తన చూపులు పరిగెడుతున్నాయన్న సంగతే మర్చిపోయింది.
ఇల్లు చక్కగా అమర్చి పెట్టి వుంది. ఇంట్లో వొక పెద్దావిడ వున్నారు. ఆవిడ అందరికీ ఏం కావాలో చెక చెకా చూసుకుంటోంది. వొక చక్కటి గది చూపించి ఇది మీరు వాడుకోండమ్మా అందావిడ. ఆ గదిలో రవి అమ్మా నాన్నల ఫోటో చూసాక అర్ధమయ్యింది అది అతనిల్లే అని.
మధ్యాన్నం వేడి వేడి పప్పూ కూరా తో రుచిగా భోజనాలు పెట్టింది ఆవిడే. భోజనాలయ్యాక, అందరూ తలో చోటూ చూసుకుని కునుకు తీస్తున్నారు.
వంటింట్లో అన్నీ సద్దుకుంటున్న పెద్దావిడ దగ్గరకెళ్ళి, ఇది సర్పంచ్ గారిల్లేనా అని అడిగింది కిరణ్.
"అవునమ్మా."
"వాళ్ళమ్మా నాన్నగారూ...?"
"ఆళ్ళు ఏడాదిలో ఆర్నెల్లు తీర్థ యాత్రల్లోనే వుంటారమ్మా..."
"మీరు...?"
"నా కొడుకూ కోడలూ రోడ్డు పెమాదం లో పోయారమ్మా. వొక్కదానివే ఏం సేత్తావ్ అని అయ్యగారు ఇక్కడకి తీసుకొచ్చేశారమ్మా. చాలా మంచి మనిషి. ఆయన పెళ్ళెందుకు సేసుకోలేదో మాత్రం మాకెవ్వరికీ తెలవదమ్మా." కిరణ్ అడగాలనుకోని ప్రశ్నకి కూడా సమాధానం చెప్పేసి, సద్దిన అంట గిన్నెలి పట్టుకుని పెరటి వైపు వెళ్ళిపోయింది.
తనకిచ్చిన గదిలో మంచం మీద ఎంత సేపు కళ్ళు తెరిచే పడుకుందో తెలియదు, ఆయమ్మ మెల్లగా తలుపు తోసి వాన్ రెడీ అంటమ్మా అని పిలిచే వరకూ.
లేచి మొహం కడుక్కుని రెడీ అవుతుంటే గుర్తొచ్చింది, రవి మళ్ కనపడనే లేదు అని.
బయటికొచ్చి వాన్ ఎక్కుతుంటే డోర్ తీసి పట్టుకున్నాడు. తన సీట్ లో కూచున్నాక, కిటికీ వైపు వచ్చి చెప్పాడు, నువ్వు వెళ్ళాలనుకున్న దారి వదలలేదు, గుడ్ అని. వాన్ కదిలిపోయింది.
కిరణ్ కనుమరుగయ్యేవరకూ చూసి, తన గదిలోకి వచ్చి తలుపు వేసుకుని, పదేళ్ళ క్రితం తన డైరీ లో కిరణ్ తో చెప్పనీ, ఎప్పటికీచెప్పాలనుకోని మాటలని చేత్తో తడిమాడు.
"కిరణ్, నాన్న ఏనాడూ నేనడిగినది కాదనలేదు. ఇవాళ ఆయన్ని ఎదిరించి, పోరాడి నీతో వచ్చెయ్యొచ్చు. కానీ అది న్యాయమని అనిపించడం లేదు.
నిన్ను, ఈ వూళ్ళో మామూలు ఇల్లాలుగా వచ్చి నాతో బతకమని కన్విన్స్ చెయ్యొచ్చు. అదీ న్యాయమనిపించడం లేదు.
నేను నిన్ను వొక అందమయిన చదువుకున్న అమ్మాయిగా మాత్రమే ఇష్టపడలేదు. నీ కలలనీ, ఆశయాలనీ కలిపి వొక వ్యక్తిగా ఇష్ట పడ్డాను. ప్రేమించడం కంటే ఎక్కువ గౌరవించాను.
అన్ని ఆశయాలు వదిలేసి వొక మామూలు అమ్మాయిగా నాతో వుంటే, నీమీద ఏ రోజయినా ఆ గౌరవం తగ్గిపోతే...అది నేనే భరించలేను.
నా దృష్టిలో ఎప్పుడూ ఎత్తులోనే వుండాలి నువ్వు.
ఇవన్నీ నీతో చెప్పి, నీ సానుభూతితో మనం దూరమవ్వొచ్చు. కానీ నేనొక మనసులేని మనిషి గా గుర్తుండిపోతేనే నీకు తక్కువ బాధ కలుగుతుందనిపిస్తోంది........"
పుస్తకం మూసి గుండెలమీద పెట్టుకుని మంచం మీద వాలాడు.
నేనాశ పడ్డట్టూ తలెత్తుకుని చూసేలాగే వున్నావు... ప్రౌడ్ ఆఫ్ యూ... మనసు మెత్తగా చెప్పింది.
****
సాయంకాలం నీరెండ వెచ్చగా మొహానికి తగులుతోంది. ఎర్రటి సూర్యుడినే చూస్తోంది కిరణ్.
నువ్వు తీసుకున్న నిర్ణయం నాకోసమే అని నాకు తెలియదనుకున్నావు కదూ. నువ్వు చూపు తిప్పుకున్నంత మాత్రాన, నీ మనసు చదవలేననుకున్నావా?
మనం కలిసి ప్రయాణం చెయ్యక పోవచ్చు. కానీ మన గమ్యం వొకటే రవీ...
కంటికి కనపడకపోయినా నీతోనే వుంటా అని చెబుతూ ఆ రోజుకి సెలవు తీసుకుంటున్న ఎర్రటి 'రవి' నే కన్నార్పకుండా చూస్తోంది డా. కిరణ్మయి.
12/28/20
కలల తీరం
"మహీ .... కాఫీ పెట్టావా? మగ్ లో పోసెయ్. వెళ్తూ కార్ లో తాగుతాలే. " హడావిడి గా రెడీ అవుతూ బెడ్ రూమ్ లోంచే అరిచి చెప్పాడు కార్తిక్.
"కాఫీ ఇక్కడ పెట్టాను."
"నేనేం చెప్పాను? వొక సారి చెప్తే వినిపించుకోలేనంతలా ఏం చేస్తున్నావ్?"
"ఏం చెప్పావ్ నువ్వూ?"
"మగ్ లో పొయ్యమన్నాను కదా!"
" ఓ అవునా... సరే పోస్తాను లే."
"ఏంటీ వొక పక్కన టైమ్ అయిపోతుంటే అంత తాపీగా చెప్తున్నావ్." మహీ ఎక్కడా కంగారు పడకపోవడం కార్తీక్ ని ఇంకా చిరాకు పెడుతోంది.
"ఇదిగో మగ్."
"నీకు నేనెవన్నా పట్టడం లేదు ఈ మధ్య."
"సరే టైమ్ అయిపోయిందన్నావ్ కదా. ఇంక వెళ్ళు."
"డాడ్, కెన్ యూ డ్రాప్ మీ ఎట్ మై స్కూల్? ఇట్స్ గెటింగ్ లేట్ ఫర్ మీ." కార్తీక్ లాగానే హడావిడి గా పరిగెడుతూ వచ్చాడు వరుణ్.
"అమ్మని అడగచ్చు కదరా. నాకే టైమ్ అయిపోతుంటే వొకపక్క."
"ఓహ్ నో. అమ్మ నా. నన్ను నా పని చేసుకోనివ్వదు. వంద ప్రశ్నలడుగుతుంది వెళ్తున్నంత సేపూ".
"వరుణ్ దట్స్ బాడ్. నువ్వు చాలా రూడ్ గా మాట్లాడుతున్నావు రా" కొడుకుని మందలిస్తూనే మహి మొహం లోకి చూసాడు కార్తీక్.
మహి ని చూస్తే వరుణ్ అన్న మాటలకి ఏమీ బాధ పడ్డట్టు లేదసలు. వీళ్ళు వెళితే తలుపేసుకుందాం అన్నట్టు నిర్లిప్తం గా చూస్తోంది.
వరుణ్ ఇలా అన్నప్పుడల్లా మహీ ఎప్పుడూ పెద్ద గొడవ చేసేది. వాడికి తనంటే కొంచెం కూడా గౌరవం లేదనీ, తను చెప్పినది వినిపించుకోడనీ బోల్డు కంప్లెంట్లు చెప్పేది. దానికి కార్తీక్ కొడుకునే వెనకేసుకొచ్చేవాడు. వాడికి ఇంకా ఇంపార్టెంట్ పనులు చాలా వున్నాయ్ అని మహీ వాదనని తేలిగ్గా తీసి పారేసే వాడు. కానీ కొన్నాళ్ళుగా మహీ దగ్గరనుంచి ఎటువంటి కంప్లెయింట్లూ రావడం లేదసలు.
మహీ గొడవపడితే బావుణ్ణనిపించింది వొక్కసారి కార్తీక్ కి.
డ్రైవ్ చేస్తుంటే కూడా మహీ నిర్లిప్తమైన మొహమే గుర్తొస్తూ వుంది. ఇవాళే కాదు, కొన్నాళ్ళుగా గమనిస్తున్నాడు.
"వరుణ్, ఈ మధ్య అమ్మ నాతో అసలు దేనికీ గొడవ పడట్లేదు రా ...!"
"ఓహ్ దట్స్ కూల్ దెన్" ఐ పాడ్ లోంచి తల తిప్పకుండానే సమాధానం చెప్పాడు వరుణ్.
"అది కాదురా. అబ్సర్వ్ చేసావా, కొన్ని రోజులుగా తను చాలా సైలెంట్ గా వుంటోంది."
"నాకవన్నీ అబ్సర్వ్ చేసే టైమ్ లేదు డాడ్...హావ్ అ గుడ్ డే...సీ యూ" స్కూల్ రాగానే హడావిడి గా కార్ దిగి పరిగెత్తాడు వరుణ్.
వాడిదంతా నా పోలికే అని పొంగిపోయేవాడు కార్తీక్ ఎప్పుడూ. పదిహేనేళ్ళకే తనకి ముఫ్ఫైల్లో వచ్చిన ఆ నిర్లక్ష్యం వచ్చేసిందా సందేహం ముల్లులా గుచ్చింది.
"వచ్చి అరగంట గడిచిపోతోంది. ఇంకో గంట ఆగితే నీ ఫ్లైట్ టైమ్ కూడా అయిపోతుంది. ఏదో కనిపెట్టేస్తానన్నావుగా ఈ రెండ్రోజుల్లో. వచ్చినదగ్గర్నుంచీ ఎటో చూస్తూ కూచున్నావ్?" చిరాకు స్పష్టంగా కనిపిస్తోంది కార్తీక్ మొహం లోనూ, స్వరం లోనూ.
అనూ ప్రశాంతం గా నవ్వింది.
"నేనలా అన్నానా? నీకలా అర్ధం అయ్యిందా? "
"...."
"సరే ఈ రెండు రోజుల ఎనాలిసిస్ కి రిసల్ట్ కావాని నీకు అంతే కదా. నేనొకటి అడుగుతాను చెప్పు. మనం కాలేజీలో వున్నప్పుడు, నువ్వు మహీ వెంటపడేటప్పుడు నువ్వు చెప్పిన అందమయిన కబుర్లేమయినా నీకు గుర్తున్నాయా?"
"అవన్నీ ఎప్పటి రోజులో... ఇంకా అవన్నీ తల్చుకుంటూ కూచుంటామా?"
"దానికవన్నీ గుర్తున్నాయి. మీ పెళ్ళయ్యాకా, నీ కెరీర్ లో స్ట్రగుల్ అయ్యే రోజుల్లో మీకు రోజూ గొడవలయ్యేవి కదా... అప్పట్లో అది ఫోన్ చేసినప్పుడల్లా చెప్పుకునే విషయాలవే వుండేవి. నీ వర్క్ టెన్షన్స్ అన్నీ దానితో చిన్నచిన్న విషయాలక్కూడా పెద్ద గొడవ చేస్తున్నావనీ. తను నీకు వొక స్ట్రెస్ బస్టర్ లా మాత్రమే కనపడుతున్నాననీ చెప్పుకుని బాధ పడుతూ వుండేది. ఆ విషయాలేవన్నా నీకు గుర్తున్నాయా?
"ఊ... ఎంత స్ట్రగుల్ అయ్యి ఈ స్టేజ్ కి వచ్చానో గుర్తొస్తూ వుంటుంది. "
"అవన్నీ దాదాపు అది మర్చిపోయింది.అవి బాధపెట్టినన్నాళ్ళూ నీతో గొడవ పడేది. నాతోనో మరొకళ్ళతోనో చెప్పుకుని బాధ పడేది."
"ఏమంటున్నావ్ నువ్వూ...?"
"అది నీతో జీవితాన్నిముడేసుకున్నప్పుడు నువ్వే తన జీవితం అనుకుంది.ప్రతీ విషయం నీతో చెప్పాలనుకునేది. నువ్వూ దానితో అన్నీ పంచుకోవాలనుకునేది. దానికి పెద్దగా అనిపించే సమస్యలు నీకు చిన్నగా అనిపించి తీసి పారేసేవాడివి. వోదార్పు ఆశించిన చోట ఎగతాళి ఎదురవడంతో అది నెమ్మదిగా నీకు దూరమవడం మొదలెట్టింది. అది దూరం జరగడం కూడా నువ్వు గమనించలేదు."
"కమాన్ అనూ! చిన్నప్పుడు చెప్పినట్టే కబుర్లు చెపుతూ కూచుంటే కుదురుతుందా. నేనేదో నాకోసమే అంతా చేసినట్టు మాట్లాడతున్నావ్ నువ్వు కూడా..."
"ఎందుకు అంత తొందరగా డిఫెన్సివ్ మోడ్ లోకి వెళిపోతావ్? నన్ను పూర్తిగా చెప్పనివ్వు." అనూ గొంతులో తీవ్రత చూసి కార్తీక్ నోరు మెదపలేదు.
నువ్వే లోకమనుకున్న మహీ నెమ్మదిగా తన టైమ్ అంతా బాబు కి ఇచ్చేసింది. ఇప్పుడు వాడూ అమ్మ కొంగట్టుకుని తిరిగే దశ దాటిపోయాడు. నీ పరుగులు చూసి, తనూ అలా పరిగెడితే పిల్లాడేమయిపోతాడో అని ఎప్పుడూ కెరీర్ బిల్డ్ చేస్కోవాలనుకోలేదు. దానికంటూ వ్యాపకాలేవీ లేవు. నువ్వు దానితో మాట్లాడ్డవంటే, నీ ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టూ అదేపనయినా చెయ్యలేకపోతే దాని గురించిన దెప్పి పొడుపులే. అవునా?
"నువ్వూ చూస్తున్నావ్ కదా నేనెంత బిజీ గా వుంటానో. నా చిరాకు లో నాకు టైమ్ కి ఏది అందకపోయినా ఇంకా లేట్ అవుతుంది కదా?"
"నేను బిజీ అని ఎవరితోనయినా చెప్పడం అంటే ఏంటో తెలుసా? నాకు నీకన్నా ముఖ్యమైన పని వుంది అని.
చూడు కార్తీక్, చాలా జంటల్లో వొకళ్ళు ఎక్కువ యాంబిషియస్ గా వుంటారు. మిగిలిన భాగస్వామికి దాని వల్ల తమ జీవితం వెలితి గా అనిపించొచ్చు. అలా అనిపించినప్పుడు ఫ్రెండ్స్ తోనో, పిల్లలతోనో, హాబీలతోనో ఆ వెలితిని నింపేస్తారు. కనీసం నింపేసామన్న భ్రమలో అయినా బతికేస్తారు.
మహీ కూడా ఆ వెలితిని పూడ్చేసుకుంది."
"దేనితో?" కార్తీక్ మొహం లో ఆశ్చర్యం, అసహనం పోటీ పడుతున్నాయ్.
"కలలతో"
"అంటే? నాకేం అర్ధం కావట్లేదు."
"నువ్వనుకుంటున్నట్టూ నిద్రపోతూ కనే కలలు కాదు. కళ్ళు తెరుచుకుని కనే కలలు."
"వాట్!?"
"ఫాంటసీ అంటుంటారు తెలుసు కదా. మనకి నచ్చినవి అందుకోలేకపోయి నిరాశ ఎదురైనప్పుడు అది మనకి అందినట్టు వూహించుకుంటే కొంతవరకూ మనసుకి తృప్తి కలుగుతుంది. మొదట్లో అది కాస్సేపు మనసు సేదతీరటానికే ఆ వూహల ఆసరా తీసుకునుండొచ్చు. నెమ్మదిగా ఆ కలలే దాని ప్రపంచం, దాన్ని ఇబ్బంది పెడుతున్న ఈ నిజం వొక కలా అయ్యాయి. నువ్వు విసుక్కున్నా, కసురుకున్నా తాత్కాలికమే కదా అని నవ్వుతూ వూరుకుంటోంది. చదువుకునే రోజుల్లో మహీ కి కోపం, చిరాకూ అన్నవి ఏమయినా తెలుసా? నాకు తెలిసి అది ఆ ప్రపంచంలోనే బతుకుతోంది. ఇది కేవలం వొక సైకాలజిస్ట్ గా ఎనలైజ్ చేసి చెప్పడం లేదు. చిన్నప్పట్నుంచీ దాంతో దగ్గరగా వున్న ప్రాణ స్నేహితురాలిగా, దాని సున్నితమైన మనసు తెలుసున్నదానిగా చెప్తున్నా.
నువ్వన్నది నిజమే రా. అది నీతో వుంటున్నా నీతో వుండటం లేదు. ఎప్పుడూ విజయాన్నే చూసిన నీకు ఎంత చెప్పినా ఈ పరిస్థితి అర్ధం అవకపోవచ్చు."
"తప్పంతా నాదే అంటావు. అంతేనా?"
"నీది తప్పనో, దానిది తప్పనో ఏవీ అనడం లేదు. అసలు నేనెవరు అది తేల్చటానికి? తప్పూ, వొప్పూ అనే త్రాసులో ఇమడని విషయాలు ఈ ప్రపంచం లో చాలా వుంటాయని చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంతే.
కార్తీక్, మనం చదువుకునేటప్పుడో, వుద్యోగం చేసేటప్పుడో కొంతమంది పరిచయం అవుతారు. చాలా దగ్గరగా అనిపిస్తారు. కొన్ని రోజులు చనువుగా మసులుతాం. కొన్నాళ్ళకి ఏదో రకంగా దూరం అయిపోతాం. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మైల్ వచ్చినా, కాల్ వచ్చినా టైమ్ వున్నప్పుడు చూద్దాం లే అని ఇగ్నోర్ చేస్తాం. వాళ్ళని మన ప్రయారిటీ లిస్ట్ లో చివరికి తోసేస్తాం.
అలా తోసేసినది జీవిత భాగస్వామే అయితే? అవతలవాళ్ళ ప్రయారిటీ లిస్ట్ లో తమ నంబర్ ఏంటో వాళ్ళకి అర్ధమైపోతే? నువ్వే ఆలోచించి చూడు."
"............."
"ఫ్లైట్ ఎనౌన్స్మెంట్ ఇచ్చేసారు. వస్తాను మరీ..." కార్తీక్ భుజం మీద చెయ్య వేసి మెత్తగా నొక్కి వదిలి చెప్పింది అనూ.
"అనూ... నా మహీ నాకెప్పటికీ దొరకదా?" తనకి తెలిసి మొదటిసారి తన గొంతు బేలగా వినబడింది కార్తీక్ కి.
చెకిన్ వైపు వెళుతున్న అనూ తల తిప్పుకుండానే చెప్పింది.
"దొరకచ్చు. తన కలల తీరం కన్నా మంచి ప్రపంచం దానికి దొరికినప్పుడు."
కనుమరుగైపోతున్న అనూ కేసే చిన్నపిల్లాడిలా బెంగగా చూస్తూ వుండిపోయాడు కార్తీక్.

***
"మహీ ఇవాళ పొద్దున్న ఆరింటికే వెళ్ళాలని చెప్పాను. గుర్తుందా."
"ఆ... నీ కాఫీ, బ్రేక్ ఫాస్ట్ టేబుల్ మీద పెట్టేసాను."
"అబ్బా అది కాదు. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడగవా?"
"ఎక్కడికి వెళ్తున్నావ్?"
మహి మొహం లో నిరాసక్తత చూసాకా కార్తీక్ చెప్పాలనుకున్నది ఇప్పుడు చెప్పాలనిపించలేదు. అనూ ని డైరెక్ట్ గా చూస్తే సర్ప్రైస్ అవుతుందిలే అనిపించింది.
అనూ కార్తీక్ కి పిన్ని కూతురు. అంతకంటే ఎక్కువ, మహి కి ప్రాణ స్నేహితురాలు. ముగ్గురూ వొకే స్కూల్, ఇంటర్ వరకూ వొకే కాలేజ్. ఇంటర్ తర్వాత ముగ్గురూ మూడు దార్లు ఎన్నుకున్నారు. కార్తిక్, మహీ ఇంజనీరింగ్ వైపు వెళ్తే, అనూ మెడిసిన్ చదివి తర్వాత సైకాలజీ లొ స్పెషలైజ్ చేసింది. అనూ ఇండియాలో సెటిల్ ఐతే, కార్తీక్, మహీ అమెరికాకి వలస వచ్చేసారు. కాన్ఫరెన్స్ పని మీద యూ.ఎస్ లో మీ వూరే వస్తున్నా అని క్రితం వారం మైల్ పెట్టింది.
***
"అడ్రెస్ మైల్ చేసావు కదా, నేనే కాబ్ లో వచ్చేద్దామనుకున్నాను. లేకపోతే మహీ వస్తుందనుకున్నా. నువ్వే స్వయంగా వస్తావని ఎక్స్పెక్ట్ చెయ్యలేదు రా..." సీట్ బెల్ట్ పెట్టుకుంటూ అంది అనూ.
"మహి కి అసలు చెప్తే కదా నువ్వొస్తున్నట్టు."
"చెప్పలేదా? అదేం?"
"వూరికే. చిన్న సర్ప్రైజ్ ఇద్దామని."
"అబ్బో నీకిలాంటి ఆలోచనలెప్పట్నుంచీ వస్తున్నాయి బాబూ..." అనూ గొంతులో కాస్త వెటకారం తొంగి చూసింది.
"అదీ కాక చూసి చాలా రోజులయ్యింది కదే..."
"రోజులు కాదురా. ఏళ్ళయింది. రెండేళ్ళ ముందు వరకూ కనీసం మహీ అయినా అప్పుడప్పుడూ ఫోన్ చేసేది, నీ మీద కంప్లెయింట్లు చెప్పడానికి. ఈ మధ్య అదీ మానేసింది. పిల్లాడేం చేస్తున్నాడు? ఎలా వున్నాడు?"
కారు అద్దంలోంచి బయటకి చూస్తూ గల గలా మాట్లాడుతోంది అనూ.
"వాడిప్పుడు లెవెంత్ గ్రేడ్. ఎప్పుడూ అబ్బాయిగారు బిజీ బిజీ. నాకే అప్పుడప్పుడూ దర్శనమిస్తూ వుంటాడు."
"నీకులాగే అనమాట. రోజులెంత గిర గిరా తిరిగిపోతున్నాయో కదా! నిన్న గాక మొన్నేమహీ వాడినెత్తుకుని అన్నం తినిపిస్తున్నది కళ్ళ ముందు మెదులుతోంది. అప్పుడే అంత పెద్దాడైపోయాడు. అవునురా మహీ ఎలా వుంది?"
"............."
బయటకి చూస్తున్నదల్లా, అవతలవైపు నుంచి సమాధానం ఎంతకీ రాకపోయే సరికి కార్తీక్ వైపు తిరిగింది. కార్తీక్ మొహం సీరియస్ గా వుంది.
కాస్సేపు మౌనం తర్వాత కార్తీకే అన్నాడు.
"మహీ గురించే నీతో కాస్త మాట్లాడాలి."
"ఏం? ఏమయిందీ? ఏదయినా సమస్యా దానికీ?"
"..........."
కార్తీక్ ఇంతలా ఆలోచిస్తున్నాడంటే విషయం ఏదో పెద్దదే అనిపించి ఏం చెప్తాడా అని అతనికేసే చూస్తోంది అనూ.
"దానికసలు కోపమే రవట్లేదు అనూ..."
"నీ కోపం చూసి దానికి వైరాగ్యం వచ్చి వుంటుంది లే. అయినా అదా నీ సమస్యా? ఇది చెప్పడానికా ఇంతలా ఆలోచించావు?" తేలిగ్గా నవ్వేసింది.
"ఇలా తీసి పడేస్తారనే ఎవరితో అయినా చెప్పడానికి కూడా భయపడుతున్నాను. నువ్వంటే చిన్నప్పట్నుంచీ మా ఇద్దరికీ తెలుసున్నదానివని నీతో చెప్పాలని పనికట్టుకుని ఎయిర్ పోర్ట్ కి వస్తే ఆఖరికి నువ్వు కూడా..." నిష్టూరంగా అన్నాడు కార్తిక్.
"పొద్దున్నే లేచి మరీ నాకోసం వచ్చావంటే ఏదో వుందనుకున్నాలే గానీ... అందులో సమస్య ఏంటో నాకర్ధం అవ్వట్లేదు. మరీ వొక్క ముక్కలో చెబితే ఏం తెలుస్తుంది రా?"
"మహీ నాతో అసలు గొడవపడ్డం లేదు. నేను ఏమన్నా ఎదురు చెప్పడం లేదు. ఇంతకన్నా ఏం చెప్పాలో నాకూ అర్ధం కావట్లేదే. చెప్పాలంటే నాతోనే వున్నా అది నాతో వున్నట్టనిపించట్లేదు."
"ఉమ్... ఎన్నాళ్ళుగా అలా వుంటోంది?"
"నేనొక నెలగా గమనిస్తున్నా..."
"సరేలే ఏదో విషయం ఎక్కువగా ఆలోచిస్తూ వుండి వుంటుంది. నేను ఈ కాన్ఫరెన్స్ అయ్యాకా వీకెండ్ ఇంట్లోనే వుంటానుగా అప్పుడు మాట్లాడి చూస్తాలే. కంగారు పడకు."
***
"కార్తీక్, వరుణ్ ఏరీ?" లేటుగా నిద్ర లేచొచ్చి కాఫీ కలుపుకుంటూ అడిగింది అనూ.
"కార్తీక్ ఆఫీస్ కి వెళ్ళాడు. వరుణ్ కి ఏదో క్లాస్ ట..."
"వీకెండ్ కూడానా...!"
"ఊ..."
"నీకూ కాఫీ కలపనా?"
"సరే..." ఏదో ధ్యాసలో వున్నట్టు వస్తున్నాయి మహీ దగ్గరనుంచి సమాధానాలన్నీ.
"పదా కాఫీ తాగుతూ కాస్సేపు పాటియో లో కూచుని కబుర్లు చెప్పుకుందాం. వచ్చినప్పటినుంచీ ఏదో హడావిడే అయిపోతోంది. ఈ వీకెండ్ కి ఇంకేం పనులు పెట్టుకోలేదు. నీతోనే గడపాలనీ " అనూ వెనకే నడిచింది మహీ.
పొద్దుటి నీరెండ వెచ్చగా తగుల్తోంది. ఏదో తనది కాని చోట వున్నట్టు దిక్కులు చూస్తూ కూచుంది మహి. తనతో మాట్లాడ్డం పెద్ద ఆసక్తి వున్నట్టు కూడా అనిపించలేదు అనూకి మహిని చూస్తుంటే.
వరుణ్ చదువు గురించీ, కార్తీక్ ప్రోజెక్ట్స్ గురించీ ఏవో ప్రశ్నలు వేస్తూ, మహీనే గమనిస్తోంది అనూ. ఎటో చూస్తూ ఊ, ఆ అన్న పదాలు దాటకుండా జవాబులు చెప్తోంది మహి.
"మహీ, మనం కాలేజీ దగ్గర సమోసాలు తినే వాళ్ళం ఆ బండి గుర్తుందా?"వున్నట్టుండి టాపిక్ మార్చింది అనూ.
"అవునే. చాలా బావుంటాయి కదా సమోసాలక్కడ. ఆ బండి ముందు కూచుని ఎన్ని కబుర్లు చెప్పుకునే వాళ్లం. రోజూ మనం అక్కడ సమోసాలు తినేటప్పుడే ఆ రోడ్ లో కార్తీక్ వెళ్ళేవాడు. ఫ్రెండ్స్ తో మాట్లాడుతూనే వెనక్కి తిరిగి దొంగ చూపులు చూసే వాడు. స్కూల్లో మనతో కలిసే తిరిగినా, కాలేజీకొచ్చేసరికి అబ్బాయిల గ్రూప్ వేరయిపోయింది కదా!
నీకు గుర్తుందా, ఇంజనీరింగ్ లో వుండగా అందరం సెలవలకి వచ్చినప్పుడు, ఇంట్లో ఫ్రెండ్స్ దగ్గరకెళ్తున్నా అని మనిద్దర్నీ సినిమాకి తీస్కెళ్ళాడు. మీ బాబాయ్ చూసేసారు. ఇంటికెళ్ళాక పెద్ద గొడవ.
ఏయ్ అనూ నీకు గుర్తుందా, న్యూయర్ కి నాకొక్కదానికే గ్రీటింగ్ పంపాడు. నీకు పంపడం మర్చిపోయాడని నీకెంత కోపమొచ్చిందో. "
అప్పటిదాకా మాటలే మర్చిపోయినట్టున్న మహి, కట్టలు తెంచుకున్న సెలయేరులా గల గలా మాట్లాడటం మొదలెట్టింది. మధ్యలో హాయిగా నవ్వుతోంది. ఆ నవ్వు అచ్చూఅనూకి తెలుసున్న మహిదే. అవునూ, కాదూ అనడానికి తప్ప అనూ కి ఏ అవకాశం ఇవ్వలేదు. అనూ వున్న రెండు రోజులూ మహీ అలా కబుర్లు చెబుతూనే వుంది. ఆ కబుర్ల నిండా వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలూ, ఆ జ్ఞాపకాల నిండా అప్పటి కార్తీక్ వుండటం అనూ దృష్టి దాటిపోలేదు.
"చెప్పలేదా? అదేం?"
"వూరికే. చిన్న సర్ప్రైజ్ ఇద్దామని."
"అబ్బో నీకిలాంటి ఆలోచనలెప్పట్నుంచీ వస్తున్నాయి బాబూ..." అనూ గొంతులో కాస్త వెటకారం తొంగి చూసింది.
"అదీ కాక చూసి చాలా రోజులయ్యింది కదే..."
"రోజులు కాదురా. ఏళ్ళయింది. రెండేళ్ళ ముందు వరకూ కనీసం మహీ అయినా అప్పుడప్పుడూ ఫోన్ చేసేది, నీ మీద కంప్లెయింట్లు చెప్పడానికి. ఈ మధ్య అదీ మానేసింది. పిల్లాడేం చేస్తున్నాడు? ఎలా వున్నాడు?"
కారు అద్దంలోంచి బయటకి చూస్తూ గల గలా మాట్లాడుతోంది అనూ.
"వాడిప్పుడు లెవెంత్ గ్రేడ్. ఎప్పుడూ అబ్బాయిగారు బిజీ బిజీ. నాకే అప్పుడప్పుడూ దర్శనమిస్తూ వుంటాడు."
"నీకులాగే అనమాట. రోజులెంత గిర గిరా తిరిగిపోతున్నాయో కదా! నిన్న గాక మొన్నేమహీ వాడినెత్తుకుని అన్నం తినిపిస్తున్నది కళ్ళ ముందు మెదులుతోంది. అప్పుడే అంత పెద్దాడైపోయాడు. అవునురా మహీ ఎలా వుంది?"
"............."
బయటకి చూస్తున్నదల్లా, అవతలవైపు నుంచి సమాధానం ఎంతకీ రాకపోయే సరికి కార్తీక్ వైపు తిరిగింది. కార్తీక్ మొహం సీరియస్ గా వుంది.
కాస్సేపు మౌనం తర్వాత కార్తీకే అన్నాడు.
"మహీ గురించే నీతో కాస్త మాట్లాడాలి."
"ఏం? ఏమయిందీ? ఏదయినా సమస్యా దానికీ?"
"..........."
కార్తీక్ ఇంతలా ఆలోచిస్తున్నాడంటే విషయం ఏదో పెద్దదే అనిపించి ఏం చెప్తాడా అని అతనికేసే చూస్తోంది అనూ.
"దానికసలు కోపమే రవట్లేదు అనూ..."
"నీ కోపం చూసి దానికి వైరాగ్యం వచ్చి వుంటుంది లే. అయినా అదా నీ సమస్యా? ఇది చెప్పడానికా ఇంతలా ఆలోచించావు?" తేలిగ్గా నవ్వేసింది.
"ఇలా తీసి పడేస్తారనే ఎవరితో అయినా చెప్పడానికి కూడా భయపడుతున్నాను. నువ్వంటే చిన్నప్పట్నుంచీ మా ఇద్దరికీ తెలుసున్నదానివని నీతో చెప్పాలని పనికట్టుకుని ఎయిర్ పోర్ట్ కి వస్తే ఆఖరికి నువ్వు కూడా..." నిష్టూరంగా అన్నాడు కార్తిక్.
"పొద్దున్నే లేచి మరీ నాకోసం వచ్చావంటే ఏదో వుందనుకున్నాలే గానీ... అందులో సమస్య ఏంటో నాకర్ధం అవ్వట్లేదు. మరీ వొక్క ముక్కలో చెబితే ఏం తెలుస్తుంది రా?"
"మహీ నాతో అసలు గొడవపడ్డం లేదు. నేను ఏమన్నా ఎదురు చెప్పడం లేదు. ఇంతకన్నా ఏం చెప్పాలో నాకూ అర్ధం కావట్లేదే. చెప్పాలంటే నాతోనే వున్నా అది నాతో వున్నట్టనిపించట్లేదు."
"ఉమ్... ఎన్నాళ్ళుగా అలా వుంటోంది?"
"నేనొక నెలగా గమనిస్తున్నా..."
"సరేలే ఏదో విషయం ఎక్కువగా ఆలోచిస్తూ వుండి వుంటుంది. నేను ఈ కాన్ఫరెన్స్ అయ్యాకా వీకెండ్ ఇంట్లోనే వుంటానుగా అప్పుడు మాట్లాడి చూస్తాలే. కంగారు పడకు."
***
"కార్తీక్, వరుణ్ ఏరీ?" లేటుగా నిద్ర లేచొచ్చి కాఫీ కలుపుకుంటూ అడిగింది అనూ.
"కార్తీక్ ఆఫీస్ కి వెళ్ళాడు. వరుణ్ కి ఏదో క్లాస్ ట..."
"వీకెండ్ కూడానా...!"
"ఊ..."
"నీకూ కాఫీ కలపనా?"
"సరే..." ఏదో ధ్యాసలో వున్నట్టు వస్తున్నాయి మహీ దగ్గరనుంచి సమాధానాలన్నీ.
"పదా కాఫీ తాగుతూ కాస్సేపు పాటియో లో కూచుని కబుర్లు చెప్పుకుందాం. వచ్చినప్పటినుంచీ ఏదో హడావిడే అయిపోతోంది. ఈ వీకెండ్ కి ఇంకేం పనులు పెట్టుకోలేదు. నీతోనే గడపాలనీ " అనూ వెనకే నడిచింది మహీ.
పొద్దుటి నీరెండ వెచ్చగా తగుల్తోంది. ఏదో తనది కాని చోట వున్నట్టు దిక్కులు చూస్తూ కూచుంది మహి. తనతో మాట్లాడ్డం పెద్ద ఆసక్తి వున్నట్టు కూడా అనిపించలేదు అనూకి మహిని చూస్తుంటే.
వరుణ్ చదువు గురించీ, కార్తీక్ ప్రోజెక్ట్స్ గురించీ ఏవో ప్రశ్నలు వేస్తూ, మహీనే గమనిస్తోంది అనూ. ఎటో చూస్తూ ఊ, ఆ అన్న పదాలు దాటకుండా జవాబులు చెప్తోంది మహి.
"మహీ, మనం కాలేజీ దగ్గర సమోసాలు తినే వాళ్ళం ఆ బండి గుర్తుందా?"వున్నట్టుండి టాపిక్ మార్చింది అనూ.
"అవునే. చాలా బావుంటాయి కదా సమోసాలక్కడ. ఆ బండి ముందు కూచుని ఎన్ని కబుర్లు చెప్పుకునే వాళ్లం. రోజూ మనం అక్కడ సమోసాలు తినేటప్పుడే ఆ రోడ్ లో కార్తీక్ వెళ్ళేవాడు. ఫ్రెండ్స్ తో మాట్లాడుతూనే వెనక్కి తిరిగి దొంగ చూపులు చూసే వాడు. స్కూల్లో మనతో కలిసే తిరిగినా, కాలేజీకొచ్చేసరికి అబ్బాయిల గ్రూప్ వేరయిపోయింది కదా!
నీకు గుర్తుందా, ఇంజనీరింగ్ లో వుండగా అందరం సెలవలకి వచ్చినప్పుడు, ఇంట్లో ఫ్రెండ్స్ దగ్గరకెళ్తున్నా అని మనిద్దర్నీ సినిమాకి తీస్కెళ్ళాడు. మీ బాబాయ్ చూసేసారు. ఇంటికెళ్ళాక పెద్ద గొడవ.
ఏయ్ అనూ నీకు గుర్తుందా, న్యూయర్ కి నాకొక్కదానికే గ్రీటింగ్ పంపాడు. నీకు పంపడం మర్చిపోయాడని నీకెంత కోపమొచ్చిందో. "
అప్పటిదాకా మాటలే మర్చిపోయినట్టున్న మహి, కట్టలు తెంచుకున్న సెలయేరులా గల గలా మాట్లాడటం మొదలెట్టింది. మధ్యలో హాయిగా నవ్వుతోంది. ఆ నవ్వు అచ్చూఅనూకి తెలుసున్న మహిదే. అవునూ, కాదూ అనడానికి తప్ప అనూ కి ఏ అవకాశం ఇవ్వలేదు. అనూ వున్న రెండు రోజులూ మహీ అలా కబుర్లు చెబుతూనే వుంది. ఆ కబుర్ల నిండా వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలూ, ఆ జ్ఞాపకాల నిండా అప్పటి కార్తీక్ వుండటం అనూ దృష్టి దాటిపోలేదు.
***
"వచ్చి అరగంట గడిచిపోతోంది. ఇంకో గంట ఆగితే నీ ఫ్లైట్ టైమ్ కూడా అయిపోతుంది. ఏదో కనిపెట్టేస్తానన్నావుగా ఈ రెండ్రోజుల్లో. వచ్చినదగ్గర్నుంచీ ఎటో చూస్తూ కూచున్నావ్?" చిరాకు స్పష్టంగా కనిపిస్తోంది కార్తీక్ మొహం లోనూ, స్వరం లోనూ.
అనూ ప్రశాంతం గా నవ్వింది.
"నేనలా అన్నానా? నీకలా అర్ధం అయ్యిందా? "
"...."
"సరే ఈ రెండు రోజుల ఎనాలిసిస్ కి రిసల్ట్ కావాని నీకు అంతే కదా. నేనొకటి అడుగుతాను చెప్పు. మనం కాలేజీలో వున్నప్పుడు, నువ్వు మహీ వెంటపడేటప్పుడు నువ్వు చెప్పిన అందమయిన కబుర్లేమయినా నీకు గుర్తున్నాయా?"
"అవన్నీ ఎప్పటి రోజులో... ఇంకా అవన్నీ తల్చుకుంటూ కూచుంటామా?"
"దానికవన్నీ గుర్తున్నాయి. మీ పెళ్ళయ్యాకా, నీ కెరీర్ లో స్ట్రగుల్ అయ్యే రోజుల్లో మీకు రోజూ గొడవలయ్యేవి కదా... అప్పట్లో అది ఫోన్ చేసినప్పుడల్లా చెప్పుకునే విషయాలవే వుండేవి. నీ వర్క్ టెన్షన్స్ అన్నీ దానితో చిన్నచిన్న విషయాలక్కూడా పెద్ద గొడవ చేస్తున్నావనీ. తను నీకు వొక స్ట్రెస్ బస్టర్ లా మాత్రమే కనపడుతున్నాననీ చెప్పుకుని బాధ పడుతూ వుండేది. ఆ విషయాలేవన్నా నీకు గుర్తున్నాయా?
"ఊ... ఎంత స్ట్రగుల్ అయ్యి ఈ స్టేజ్ కి వచ్చానో గుర్తొస్తూ వుంటుంది. "
"అవన్నీ దాదాపు అది మర్చిపోయింది.అవి బాధపెట్టినన్నాళ్ళూ నీతో గొడవ పడేది. నాతోనో మరొకళ్ళతోనో చెప్పుకుని బాధ పడేది."
"ఏమంటున్నావ్ నువ్వూ...?"
"అది నీతో జీవితాన్నిముడేసుకున్నప్పుడు నువ్వే తన జీవితం అనుకుంది.ప్రతీ విషయం నీతో చెప్పాలనుకునేది. నువ్వూ దానితో అన్నీ పంచుకోవాలనుకునేది. దానికి పెద్దగా అనిపించే సమస్యలు నీకు చిన్నగా అనిపించి తీసి పారేసేవాడివి. వోదార్పు ఆశించిన చోట ఎగతాళి ఎదురవడంతో అది నెమ్మదిగా నీకు దూరమవడం మొదలెట్టింది. అది దూరం జరగడం కూడా నువ్వు గమనించలేదు."
"కమాన్ అనూ! చిన్నప్పుడు చెప్పినట్టే కబుర్లు చెపుతూ కూచుంటే కుదురుతుందా. నేనేదో నాకోసమే అంతా చేసినట్టు మాట్లాడతున్నావ్ నువ్వు కూడా..."
"ఎందుకు అంత తొందరగా డిఫెన్సివ్ మోడ్ లోకి వెళిపోతావ్? నన్ను పూర్తిగా చెప్పనివ్వు." అనూ గొంతులో తీవ్రత చూసి కార్తీక్ నోరు మెదపలేదు.
నువ్వే లోకమనుకున్న మహీ నెమ్మదిగా తన టైమ్ అంతా బాబు కి ఇచ్చేసింది. ఇప్పుడు వాడూ అమ్మ కొంగట్టుకుని తిరిగే దశ దాటిపోయాడు. నీ పరుగులు చూసి, తనూ అలా పరిగెడితే పిల్లాడేమయిపోతాడో అని ఎప్పుడూ కెరీర్ బిల్డ్ చేస్కోవాలనుకోలేదు. దానికంటూ వ్యాపకాలేవీ లేవు. నువ్వు దానితో మాట్లాడ్డవంటే, నీ ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టూ అదేపనయినా చెయ్యలేకపోతే దాని గురించిన దెప్పి పొడుపులే. అవునా?
"నువ్వూ చూస్తున్నావ్ కదా నేనెంత బిజీ గా వుంటానో. నా చిరాకు లో నాకు టైమ్ కి ఏది అందకపోయినా ఇంకా లేట్ అవుతుంది కదా?"
"నేను బిజీ అని ఎవరితోనయినా చెప్పడం అంటే ఏంటో తెలుసా? నాకు నీకన్నా ముఖ్యమైన పని వుంది అని.
చూడు కార్తీక్, చాలా జంటల్లో వొకళ్ళు ఎక్కువ యాంబిషియస్ గా వుంటారు. మిగిలిన భాగస్వామికి దాని వల్ల తమ జీవితం వెలితి గా అనిపించొచ్చు. అలా అనిపించినప్పుడు ఫ్రెండ్స్ తోనో, పిల్లలతోనో, హాబీలతోనో ఆ వెలితిని నింపేస్తారు. కనీసం నింపేసామన్న భ్రమలో అయినా బతికేస్తారు.
మహీ కూడా ఆ వెలితిని పూడ్చేసుకుంది."
"దేనితో?" కార్తీక్ మొహం లో ఆశ్చర్యం, అసహనం పోటీ పడుతున్నాయ్.
"కలలతో"
"అంటే? నాకేం అర్ధం కావట్లేదు."
"నువ్వనుకుంటున్నట్టూ నిద్రపోతూ కనే కలలు కాదు. కళ్ళు తెరుచుకుని కనే కలలు."
"వాట్!?"
"ఫాంటసీ అంటుంటారు తెలుసు కదా. మనకి నచ్చినవి అందుకోలేకపోయి నిరాశ ఎదురైనప్పుడు అది మనకి అందినట్టు వూహించుకుంటే కొంతవరకూ మనసుకి తృప్తి కలుగుతుంది. మొదట్లో అది కాస్సేపు మనసు సేదతీరటానికే ఆ వూహల ఆసరా తీసుకునుండొచ్చు. నెమ్మదిగా ఆ కలలే దాని ప్రపంచం, దాన్ని ఇబ్బంది పెడుతున్న ఈ నిజం వొక కలా అయ్యాయి. నువ్వు విసుక్కున్నా, కసురుకున్నా తాత్కాలికమే కదా అని నవ్వుతూ వూరుకుంటోంది. చదువుకునే రోజుల్లో మహీ కి కోపం, చిరాకూ అన్నవి ఏమయినా తెలుసా? నాకు తెలిసి అది ఆ ప్రపంచంలోనే బతుకుతోంది. ఇది కేవలం వొక సైకాలజిస్ట్ గా ఎనలైజ్ చేసి చెప్పడం లేదు. చిన్నప్పట్నుంచీ దాంతో దగ్గరగా వున్న ప్రాణ స్నేహితురాలిగా, దాని సున్నితమైన మనసు తెలుసున్నదానిగా చెప్తున్నా.
నువ్వన్నది నిజమే రా. అది నీతో వుంటున్నా నీతో వుండటం లేదు. ఎప్పుడూ విజయాన్నే చూసిన నీకు ఎంత చెప్పినా ఈ పరిస్థితి అర్ధం అవకపోవచ్చు."
"తప్పంతా నాదే అంటావు. అంతేనా?"
"నీది తప్పనో, దానిది తప్పనో ఏవీ అనడం లేదు. అసలు నేనెవరు అది తేల్చటానికి? తప్పూ, వొప్పూ అనే త్రాసులో ఇమడని విషయాలు ఈ ప్రపంచం లో చాలా వుంటాయని చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంతే.
కార్తీక్, మనం చదువుకునేటప్పుడో, వుద్యోగం చేసేటప్పుడో కొంతమంది పరిచయం అవుతారు. చాలా దగ్గరగా అనిపిస్తారు. కొన్ని రోజులు చనువుగా మసులుతాం. కొన్నాళ్ళకి ఏదో రకంగా దూరం అయిపోతాం. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మైల్ వచ్చినా, కాల్ వచ్చినా టైమ్ వున్నప్పుడు చూద్దాం లే అని ఇగ్నోర్ చేస్తాం. వాళ్ళని మన ప్రయారిటీ లిస్ట్ లో చివరికి తోసేస్తాం.
అలా తోసేసినది జీవిత భాగస్వామే అయితే? అవతలవాళ్ళ ప్రయారిటీ లిస్ట్ లో తమ నంబర్ ఏంటో వాళ్ళకి అర్ధమైపోతే? నువ్వే ఆలోచించి చూడు."
"............."
"ఫ్లైట్ ఎనౌన్స్మెంట్ ఇచ్చేసారు. వస్తాను మరీ..." కార్తీక్ భుజం మీద చెయ్య వేసి మెత్తగా నొక్కి వదిలి చెప్పింది అనూ.
"అనూ... నా మహీ నాకెప్పటికీ దొరకదా?" తనకి తెలిసి మొదటిసారి తన గొంతు బేలగా వినబడింది కార్తీక్ కి.
చెకిన్ వైపు వెళుతున్న అనూ తల తిప్పుకుండానే చెప్పింది.
"దొరకచ్చు. తన కలల తీరం కన్నా మంచి ప్రపంచం దానికి దొరికినప్పుడు."
కనుమరుగైపోతున్న అనూ కేసే చిన్నపిల్లాడిలా బెంగగా చూస్తూ వుండిపోయాడు కార్తీక్.
7/16/15
కలల తీరం
నా కథ కలల తీరం తానా 20 వ తానా సావనీరు లో వచ్చింది. రాయమని ప్రోత్సహించి, వోపికగా నా కథ కి సవరణలు, సూచనలూ అందించిన సంపాదకులు నారాయణ స్వామి గారికీ, ప్రచురించిన తానా కి ధన్యవాదాలు.
http://patrika.tana.org/20th-conference-souvenir/#p=259

6/1/15
కలల ప్రపంచం
మొన్న ఆదివారం విజయవాడ రేడియో లో బాలల కార్యక్రమం లో చదివిన కథ. వెనకాల అడవి ఎఫెక్టు వచ్చే సౌడ్స్ కూడా కలిపారుట. :)
కలల ప్రపంచం
"మాతికా మాతికా.... రా మనం అజ్జున్ వాళ్ళింటికి వెళదాం" పరిగెట్టుకుంటూ వచ్చి అక్క చెయ్య పట్టుకుని లాగడం మొదలెట్టాడు మూడేళ్ళ మయూఖ్.
"నా పేరు మౌక్తిక రా బాబూ... అయినా నన్ను అక్కా అని పిలవాలని చెప్పానా" విసుక్కుంది ఏడేళ్ళ మౌక్తిక.
"అబ్బా తొందరగా రా అజ్జున్, మేఘనా వాళ్ళింటికి రమ్మన్నారు కదా ఆడుకోడానికీ?" హడావిడి పడుతూ పరిగెట్టాడు మయూఖ్. వాడికింకా అర్జున్ అని అనడం రాదు మరి.
మౌక్తిక వచ్చి రిమోట్ నొక్కగానే వాళ్ళింటి తలుపులు తెరుచుకున్నాయి.
ఇంటి ముందే పెద్ద రెడ్ కార్ ఆగి వుంది.
తను రోజూ చేతులతో పట్టుకుని ఆడుకునే కార్ ఎంత పెద్దగా అయ్యిందో అని ఆశ్చర్యంగా చూసాడు మయూఖ్.
మౌక్తిక తన ప్రిన్సెస్ బాగ్ లోనుంచి మళ్ళీ రిమోట్ తీసింది. ఈ సారి ఈ రిమోట్ వేరేది. ఇదీ కార్ లాగానే ఎరుపు రంగు లో వుంది. మౌక్తిక ఆ రిమోట్ నొక్కగానే కారు తలుపు తెరుచుకుంది.
మౌక్తిక మయూఖ్ చెయ్య పట్టుకుని, కారులోకెక్కించింది. మౌక్తిక కూడా మయూఖ్ పక్కనే కూచుంది. ఇప్పుడు కారు నడపడానికెవరొస్తారా అని కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్నాడు మయూఖ్.
"ఎక్కడికి వెళ్ళాలో ఎడ్రెస్ చెప్పండీ?" అని వినపడింది హఠాత్తుగా.
మయూఖ్ కి భయమేసి మౌక్తిక చెయ్య గట్టిగా పట్టుకున్నాడు. మౌక్తిక, భయపడకు తమ్మూ. ఇది మన రెడ్ కార్ మాట్లాడుతోంది. దీని పేరేంటో తెలుసా? మెరుపు. అదే మనల్ని తీస్కెళిపోతుంది తెలుసా అని నవ్వింది.
మౌక్తిక ఎడ్రెస్ చెప్పగానే, మెరుపు మెరుపులాగే జుయ్య్ మని దూసుకు పోయింది. వొక పెద్ద అడవి ముందుకి వచ్చి ఆగిపోయింది.
మౌక్తికా, మయూఖ్ వొకళ్ళ మొహాలు వొకళ్ళు చూసుకున్నారు.
"మీరు చెప్పిన అడ్రెస్ లో నేను ఇక్కడిదాకానే తీసుకురాగలను." అని చెప్పింది మెరుపు.
మౌక్తిక ముందు కారు దిగింది. మయూఖ్ మౌక్తిక వెనకాలే దిగి చుట్టూ చూస్తూ నుంచున్నాడు.
"మీరు వెళ్ళి వచ్చేదాకా నేనిక్కడే వుంటాను." అని చెప్పి మెరుపు వెళ్ళి వొక చెట్టుకింద ఆగింది.
ముందు మౌక్తిక నడుస్తుంటే, అక్క చెయ్యి పట్టుకుని దిక్కులు చూసుకుంటూ వెనకాలే నడుస్తున్నాడు మాయూఖ్.
చెట్లూ పొదలూ తప్పించుకు వెళ్ళగానే అక్కడ ఆకుపచ్చటి చెట్లూ, ఆ చెట్ల నీడల్లోంచి చొచ్చుక్కుని వస్తున్న సూర్యుడి బంగారు కిరణాలు, కిందంతా తలలూపి పలకరిస్తూ రంగు రంగుల పువ్వులూ. ఆ పూలమీద వొకదాని మీద నుంచి వొక దానిమీదకి వాలుతూ అల్లరి చేస్తూ తిరుగుతున్న పంచె వన్నేల సీతాకోక చిలికలూ.
వాటిని ఆనందంగా చూస్తూ నడుస్తున్న మౌక్తిక భుజం మీద ఏదో వాలినట్టనిపించి చూసింది. వొక బుజ్జి వుడత వచ్చి కూచుంది అక్కడ.
దాన్ని చూసి కాస్త కంగారు పడింది మౌక్తిక.
"భయపడకు నేస్తం. ఈ అడవిలో కొత్తగా కనిపించేసరికి ఏదయినా సాయం కావాలేమో అడుగుదామని వచ్చాను" అంది బుజ్జి వుడత.
ఆ వుడత చాలా ముద్దొచ్చేసింది మయూఖ్ కి. వాడు చెయ్య జాపగానే బుడుంగు మని వాడి చెయ్యమీదకి దూకేసింది.
"నీ పేరేంటీ?" అనడిగాడు దాన్ని.
"నా పేరూ ఖుషీ. ఎప్పుడూ ఆనందంగా వుంటాననీ అలా పిలుస్తారు ఇక్కడందరూ" అని చెప్పిందది.
"అసలెప్పుడూ ఆనందంగా ఎలా వుంటావు?" అడిగాడు మయూఖ్.
"వాడికన్నీ ప్రశ్నలే. " అంది మౌక్తిక.
"నేనెవ్వరికీ చెడు చెయ్యనూ. చెడు జరగాలని కోరుకోను. అందుకే నాకే దిగులూ వుండదు. ఎప్పుడూ హాయిగా నవ్వుతూ వుండగలను." అని చెప్పి గబుక్కున కిందకి దిగి వొక చిన్న పండు తెచ్చుకుని మళ్ళీ మయూఖ్ భుజం మీదకి గెంతింది ఖుషీ.
"భలే భలే" అంటూ చప్పట్లు కొట్టింది మౌక్తిక.
"మేము మా నేస్తాలు అజ్జున్, మేఘనా వాళ్ళింటికి వెళదామని బయలుదేరాం. మా కారు మెరుపు కి ఇక్కడిదాకానే దారి తెలుసుట. నువ్వు సాయం చేస్తావా మరీ? " అన్నాడు మయూఖ్ ఖుషీ తో.
"మరి మీకు అడ్రెస్ తెలుసా?" అడిగింది ఖుషీ.
"వో నాకు తెలుసుగా." గడగడా చెప్పేసింది మౌక్తిక.
"హ్మ్...మీరు చెప్పిన వూరు అడవికి ఆ చివర వుంది. మనం అడవికి ఈ చివర వున్నాం. అంత దూరం నడవాలంటే మీకు కాళ్ళు నెప్పెడతాయే" అని ఆలోచనలో పడింది ఖుషీ.
"ఊ... వుండండి ఇప్పుడే వస్తా" అని చెట్ల మధ్యలోకి తుర్రుమంది.
అక్కడ పువ్వులన్నీ నవ్వుతూ వీళ్ళకేసి చూస్తున్నాయనిపించి వాటినే కన్నార్పకుండా చూస్తూ నిలబడ్డారు ఇద్దరూ.
వెళ్ళినంత వేగంగానే పరిగెట్టుకుంటూ వచ్చింది ఖుషీ. దాని వెనకాలే వొక యేనుగు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది.
ఏనుగుని చూసి భయపడిపోయిన మౌక్తికా, మయూఖ్ చెట్టువెనక్కి పారిపోయారు అమ్మో ఏనుగు ఏనుగు అని అరుస్తూ.
"అయ్యో భయపడకండి. ఇతని పేరు సహాయ్. ఎప్పుడూ అందరికీ చాలా సాయం చేస్తూ వుంటాడు. మిమ్మల్ని మీ నేస్తాల దగ్గరకి తీసుకెళతాడని పిలుచుకొచ్చాను." చెప్పింది ఖుషీ.
నెమ్మదిగా చెట్టు వెనకనుంచి ముందుకొచ్చి నుంచున్నారు మయూఖ్, మౌక్తికా.
ఎక్కడికి వెళ్ళాలో ఖుషీ చెప్పగానే, "పదండి పిల్లలూ పోదాం" అన్నాడు సహాయ్.
మౌక్తికా, మయూఖ్ వొకళ్ళ మొహాలు వొకళ్ళు చూసుకున్నారు.
"వోహో ఎలా ఎక్కాలని ఆలోచిస్తున్నారా? నేను సాయం చేస్తాగా..." అని తొండం ముందుకి చాపింది.
అది పట్టుకోగానే వొక్కొక్కళ్ళనీ తన వీపు మీదకి జాగ్రత్తగా తీసుకెళ్ళి కూచోబెట్టుకుంది.
మరి వెళ్దామా అనగానే ఇద్దరూ నవ్వుతూ తలూపారు. ఖుషీ కి టా టా చెప్పి ముగ్గురూ అక్కడ నుంచి బయల్దేరారు.
అడవిలో ప్రతీ చెట్టు పుట్టా, కొమ్మా రెమ్మా గురించీ చెపుతూ వాటిని పలకరిస్తూ వాళ్ళిద్దరినీ తీసుకెళుతోంది సహాయ్.
"అక్కా మరేమో నాకు ఆకలేస్తోంది" మౌక్తిక చెవిలో రహస్యంలా చెప్పాడు మయూఖ్.
వాడెంత నెమ్మదిగా చెప్పాననుకున్నా ఏనుగు చెవులు పెద్దవికదా చక్కగా వినపడిపోయింది.
"ఏంటి పిల్లలూ ఆకలేస్తోందా? కాస్సేపు ఆగండి. ఒక మంచి చోటుకి తీసుకెళతా." అని చెప్పాడు సహాయ్.
అన్నట్టుగానే వొక పావుగంట లో వొక చోటకి తీసుకెళ్ళాడు. అక్కడకెళ్ళగానే పిల్లలిద్దరూ కళ్ళూ నోరూ తెరుచుకుని వుండిపోయారు.
అక్కడ చెట్లకి రక రకాల చాక్లెట్లూ, బిస్కట్లూ విరక్కాసి వున్నాయి. చిన్న చిన్న కొలనుల నిండా రక రకాల ఐస్ క్రీములు వున్నాయి.
"అలా చూస్తే కడుపు నిండి పోతుందా? మీకు నచ్చినవన్నీ తినెయ్యండి" అన్నాడు సహాయ్.
"అమ్మ ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుందంటుంది." దిగులుగా చెప్పాడు మయూఖ్.
"ఇవి ప్రకృతి తల్లి ఇచ్చిన ఐస్ క్రీములు. ఇవి తింటే ఏమీ కాదు." అనగానే ఇద్దరూ వాళ్ళకి నచ్చినవన్నీ తినేసారు. ఎన్ని తిన్నా మయూఖ్ కి లాలీ పాప్ కూడా తింటేగానీ తృప్తిగా లేదు. అది చూస్తే వొక చిటారు కొమ్మకి వుంది.
సహాయ్ దగ్గరకెళ్ళి మరేమో నాకా లాలి పప్ తినాలనుంది అన్నడు మయూఖ్. సహాయ్ తన తొండం ఎత్తి ప్రయత్నించినా అది అందలేదు.
బుంగ మూతి పెట్టిన మయూఖ్ ని చూసి ఏమీ ఫరవాలేదు అని చెప్పి "అల్లరీ" అని గట్టిగా అరిచాడు. ఎక్కడనుంచి వచ్చిందో వొక ఎర్రటి కోతి గబుక్కున వురికింది.
"ఏంటీ నీ పేరు అల్లరా? భలే విచిత్రంగా వుందే?" అన్నారు పిల్లలిద్దరూ.
"మరి నేనెప్పుడూ చేసేది అదే కదా. ఇంతకీ నన్నిప్పుడు దేనికి పిలిచారు?" అని అడిగింది అల్లరి.
"ఈ పిల్లలకి అన్నీ అందాయి గానీ ఆ లాలీ పాప్ అందడంలేదోయ్. నాక్కూడా అందలేదూ. నీ వల్ల మాత్రమే అవుతుందని పిలిచాను." చెప్పాడు సహాయ్.
"ఓహ్ అదెంత పనీ ఇప్పుడే తెచ్చిస్తా" అని కొమ్మ మీద నుంచి కొమ్మ మీదకి దూకుతూ కోతి కొమ్మచ్చి ఆడేసి ఇద్దరికీ రెండు లాలీ పాప్ లు తెచ్చి ఇచ్చేసింది అల్లరి.
"పిల్లలూ మరి బయల్దేరదామా?" అనడిగాడు సహాయ్.
అందరూ అల్లరికి టా టా చెప్పి అక్కడ నుంచి బయల్దేరారు.
దార్లో నారింజ రసం వున్న జలపాతం కూడా చూపించాడు సహాయ్. అక్కడ కాస్సేపు ఆ జ్యూస్ తాగి ఆడుకుని మళ్ళీ బయల్దేరారు.
వొక పెద్ద వాగు దగ్గరకి రాగానే ఇదిగో ఇది దాటితే అవతల వైపున్నదే మీరెళ్ళాలనుకున్న వూరు అని చెప్పి ఇద్దర్నీ కిందకి దించాడు.
"మరిది దాటడం ఎలా?" ఇద్దరూ బిక్కమొహాలేసుకుని అడిగారు సహాయ్ ని.
"అది మాత్రం నా వల్ల కాదు పిల్లలూ. ఈ వాగు లోతు నా పొడవుకన్నా ఎక్కువ" అని చెప్పాడు.
మరిప్పుడెలా అని ఆలోచిస్తుంటే, అక్కడకొక పెద్ద జిరాఫీ వచ్చింది.
"ఏంటీ అందరూ అంతలా ఆలోచిస్తున్నారు?" అనడిగింది సహాయ్ ని.
"అరే అభయ్ నువ్వా? నీ సంగతే మర్చిపోయి తెగ ఆలోచిస్తున్నాం. ఇంక మా సమస్య తీరిపోయినట్టే." అన్నాడు సహాయ్.
"ఇదిగో మౌక్తికా, మయూఖ్ ఇతని పేరు అభయ్. చక్కగా ఈ యేరు దాటించేస్తాడు" అని చెప్పేసాడు సహాయ్.
"వో అదెంత పనీ. కానీ వొకసారి వొకళ్ళని మాత్రమే ఎక్కించుకోగలను. ముందెవరు ఎక్కుతారో చెప్పండి." అన్నాడు అభయ్.
మౌక్తికా మయూఖ్ ఇద్దరూ ముందు నేను వెళతా అంటే నేను వెళతా అని కాస్సేపు పేచీ పడ్డారు. వాళ్ళ గొడవ ఎంతకీ తేలకపోవడం చూసి, సహాయ్ "సరే మీ ఇద్దరిలో ఎవరి దగ్గరైనా వొక రూపాయి వుందా?" అనడిగాడు.
"నా దగ్గరుందిగా." అని మౌక్తిక తీసిచ్చింది.
"సరే ఇది బొమ్మ పడితే మౌక్తిక ముందు వెళ్తుంది, బొరుసు పడితే మయూఖ్ ముందర వెళ్తాడు. సరేనా?" అనడిగాడు సహాయ్.
ఇద్దరూ వొప్పుకున్నాక తన తొండంతో పైకి ఎగరేసాడు. కింద పడగానే చూస్తే బొమ్మ పడింది.
మయూఖ్ మొహం ముడుచుకునే మౌక్తిక ని ముందు పంపించాడు. మౌక్తిక ఎక్కడం కోసం తన మెడని వంచి తనని పట్టుకోగానే తల ఎత్తింది అభయ్. అభయ్ తలెత్తగానే జారుడు బల్ల మీద నుంచి జారినట్టు జారి వీపు మీదకి వెళ్ళి పడింది మౌక్తిక. అది చూసి భలే వుందే అని మయూఖ్ చప్పట్లు కొట్టాడు.
" చూడు మౌక్తికా, వాగు మధ్యలో వొకచోట చాలా లోతుగా వుంటుంది. అక్కడ మాత్రం నా తల మీదకి వచ్చేసి పట్టుకోవాలి. లేకపోతే మునిగిపోతావు జాగ్రత్త." అని బయల్దేరే ముందే చెప్పాడు అభయ్.
జాగర్తగా మౌక్తిక ని దించేసి కాస్సేపట్లో వెనక్కి వచ్చి మయూఖ్ ని కూడా తీసుకెళ్ళాడు. సహాయ్ ఇద్దరికీ టాటా చెప్పాడు.
మయూఖ్ ని మౌక్తిక దగ్గర దింపి "అదిగో ఆ కనపడేదే మీ నేస్తాల ఇల్లు." అని చెప్పాడు అభయ్.
కొంచెం దూరం లో మేఘనా, అర్జున్ వాళ్ళ తోటలో ఆడుతూ కనపడుతున్నారు వాళ్ళకి.
"మయూఖ్ మయూఖ్ మయూఖ్ లేవరా... చూడు మనతో ఆడుకోడానికి ఎవరొచ్చారో? వాళ్ళప్పుడే బొబ్బ పోసేస్కుని రెడీ అయిపోయారు. నువ్వు చూడు ఇంకా నిద్ర పోతున్నావు. " మౌక్తిక గట్టిగా అరిచినట్టు మాట్లాడుతోంది.
"అంత దూరం నుంచి ఇంత పొద్దున్నే ఎలా వచ్చేసారు?" కళ్ళు నులుముకుంటూ అడిగాడు మయూఖ్.
"నడిచే వచ్చాం. మీకూ మాకూ మధ్యలో వొకిల్లేగా వుందీ?" అంది మేఘన.
కాస్సేపు వాళ్ళిద్దరికేసి తేరి పార చూసి నవ్వడం మొదలెట్టాడు మయూఖ్. వాడెందుకలా నవ్వుతున్నాడో మాత్రం వాళ్ళెవరికీ అర్ధం కాలేదు.
*****
కలలకీ వూహలకీ హద్దులు లేవు. కానీ ఆ స్వేఛ్చ వుండేది కూడా మన కలలకి పరిమితులుండాలని తెలియని తియ్యటి బాల్యం లోనే.

2/2/15
పదవ తరగతి జ్ఞాపకాలు కౌముది లో
ఈ నెల కౌముది లో నా పదవ తరగతి జ్ఞాపకాలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన కిరణ్ ప్రభగారికీ, రాయమని ప్రోత్సహించిన మధుర కీ ధన్యవాదాలు.
http://www.koumudi.net/Monthly/2015/february/feb_2015_tenthclass.pdf
Subscribe to:
Posts (Atom)