పొద్దుట్నుంచీ ఆకాశమంతా మబ్బుపట్టి కొంచెం dull గా వుంది. సాయంత్రం ఆరింటికే కాస్త చీకటి గా అనిపిస్తోంది. ఆఫీసు నుంచి వచ్చి కాఫీ పెట్టుకున్నాక ఆ వాతావరణానికి ఏదైనా పాట వింటే కాఫీ ఇంకా బావుంటుంది కదా అనే అలోచనొచ్చింది...wake up sid లో పాట వినాలనిపించింది...ఈమధ్యే ఆ పాట ఎక్కడో వినటంతో మనసులో గింగిరాలు తిరుగుతోంది....వేడి వేడి కాఫీ గుటకలేస్తూ బయటకి చూస్తుంటే ఏదో తెలియని depression...ఆ వాన చూస్తుంటే అమ్మో ఇంక fall ఆ తర్వాత winter...నాకు US వచ్చినదగ్గర్నుంచీ చలికాలం అంటే చెడ్డ చిరాకు...నాలుగవకుండానే కమ్ముకొచ్చేసే చీకటి...ఎప్పుడో కాని దర్శనం ఇవ్వని సూరీడు...ఎముకలు కొరికేసే చలి...మోడు వారిపోయి పాత సినిమాల్లో భగ్న ప్రేమకి చిహ్నాల్లా నించునే చెట్లు అవన్నీ తల్చుకుంటూ...ఆ వాతావరణం నా కళ్ళముందిప్పుడే వాలిపోయిందన్నట్టు దిగులు పడిపోతూ కళ్ళు మూసుకున్నాను...చెవిలోకి పాట సన్నగా దూరుతోంది నా అలోచనలన్నీ చెదరగొడుతూ...
ఎదురుగా పాల మీగడ లాంటి తెల్ల చుడీదార్ వేస్కుని...ఆ వాన లో ఆనందంగా ఎగురుతూ గంతులేస్తూ...తడుస్తున్న ఆకుల్నుంచీ పువ్వుల్లనుంచీ నీటి ముత్యాలేరుకుంటూ...సంతోషంలో తడిసి ముద్దైపోతూ...ఎవరా అమ్మాయి అని కళ్ళు చిట్లించి చూస్తే నా మొహం లానే వుంది...
అమ్మో వానలో తడిస్తే ఇంకేమైనా వుందా...తుమ్ములూ...జలుబు..దగ్గు..జ్వరం...రేపు office కి ఎలా వెళ్తావ్ అని వూహల్లో విహరిస్తున్న మనసుని..మెదడు చెవి మెలేసి లాక్కొచ్చేసింది...computer లో పాట ఆగిపోయింది...కళ్ళు తెరిచే సరికి నా roomie విసుగ్గా మొహం పెట్టి చూస్తోంది..ఎంత సేపు నుంచుటావ్ అక్కడే...stove మీద నీ గిన్ని పక్కకి పెడితే నా వంట చేకుంటా అన్న మాటలన్నీ మొహంలోకే ప్రతిఫలింపచేస్తూ...
అప్పటిదాక వున్న విసుగునుంచి ఏదో తెలియని relief...నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచా...
ఇంతకీ నే విన్న పాట ఏదో చెప్పలేదు కదూ...
नेणा करू बंद बंद....बहजाये बूँद बूँद
तड्पायेरे... क्यो सुनाए गीत मल्हार दे .......
ఏ పాటో చెప్పుకోండి
5 comments:
:))...అప్పుడప్పుద్ అంతే అండి...
అదే మన మూడ్ బాగునప్పుడు అదే సీన్ చాల బాగా కనిపిస్తుంది...
తొక్కలో జ్వరం వస్తే వచ్చింది..ఓ సరి తడిచెయల్సిన్దీ :) :P
తడుస్తున్న ఆకుల్నుంచీ పువ్వుల్లనుంచీ నీటి ముత్యాలేరుకుంటూ...సంతోషంలో తడిసి ముద్దైపోతూ...ఎవరా అమ్మాయి అని కళ్ళు చిట్లించి చూస్తే నా మొహం లానే వుంది...
claps claps...whistles kooda
ae paato cheppundondi annaruga...naa favourite song..."goonjasa hai koi iktara" :)...
కిరణ్...అలా అంటారా...అలా don't care వయసు దాటిపోతోందనే నా దిగులు...పైగా నేను చిన్నప్పుడే ముసలమ్మనీ :)
శైలబాల గారూ...thank you for your claps and whistles...
రూపా....100% correct...మీకు 20points...:)
పాటేదైతేనేం? అది పంచిన అనుభూతి ముఖ్యం కానీ..
ఏమంటారు??
Post a Comment