3/23/11

కధ మళ్ళీ మొదలైంది


చేరుకోలేకపోయిన తీరాలనుంచీ
ఎదగలేకపోయిన ఎత్తులనుంచీ
పొందలేకపోయిన ప్రేమలనుంచీ
గెలుచుకోలేకపోయిన మనసులనుంచీ
దూరమయిపోయిన మనుషులనుంచీ
పోటీ పడలేకపోయిన సహచరులనుంచీ
ఆవిరైపోయిన ఆశలనుంచీ
కరిగిపోయిన కలలనుంచీ
తీర్చుకోలేకపోయిన కోరికలనుంచీ
ఒప్పుకోలేకపోతున్న ఓటములనుంచీ
సర్దుకోలేకపోతున్న జీవితం నుంచీ
దూరంగా పారిపోవాలని
అలోచనలే దరిచేరనంత వేగంగా పరుగెడుతూ
అలిసిపోయి ఆగిపోయిన నిమిషం లో
ఇదే అదనన్నట్టు తలపులన్నీ దాడి చేసి
మనసుని వుక్కిరిబిక్కిరి చేస్తుంటే...
ముసిరిన జ్ఞాపకాల తుఫానులోంచొక బాల్యస్మృతి వెక్కిరించింది
"నాన్నగారెప్పుడూ చిర్రు బుర్రులాడుతూ వుంటారు
నేను పెద్దయ్యాక అస్సలు నాన్నగారిలా వుండను"
తన అమాయకత్వాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని నవ్వుకుంటుంటే
పక్క గదిలోంచి బాబిగాడి గుసగుసలు
నాన్నగారికెప్పుడూ ఖాళీ వుండదు...నాతో కబుర్లే చెప్పరు
పెద్దయ్యాక అస్సలు నాన్న గారిలా వుండను
మనసు చిన్నగా నిట్టూర్చించి
కధ మళ్ళీ మొదలయ్యిందని

12 comments:

Unknown said...

చాలా బాగుందండీ!

చెప్పాలంటే...... said...

చాలా చాలా బాగుందండీ

Praveena said...

chala correct ga chepparu...

Jai Telangana said...

Very nice, and very true.

తృష్ణ said...

చాలా బాగుందండీ.

sphurita mylavarapu said...

@చిన్ని ఆశ, ఁఅంజూ, @ప్రవీణ, @తృష్ణ, @జై తెలంగాణా ధన్యవాదాలు

veera murthy (satya) said...

చాలా బాగా రాసారు!

గిరీష్ said...

Excellent

Radha said...

...పెళ్ళవ్వగానే పెళ్ళాం అనబడేది పొద్దున్నే ఆయనగారు లేచేసరికి తలకి పిడప పెట్టేస్కుని(స్నానం చేసైనా కావొచ్చు, చెయ్యకుండానైనా కావొచ్చు)

hahahaha.. cheyyakunda kooda pidapa kattukuntaaraandi?
nizame telugu cinema lu ekkuva choosthe ilaanti kalale untai

nice one...

kiran said...

superbb..!! :)

sphurita mylavarapu said...

Thanks every one for your appreciation...

sphurita mylavarapu said...

రాధా, మరి సినిమాల్లో వీరొ ఇన్ లు అలాగే పెట్టుకుంటారు...పిడపకి పిన్నులు కూదా పెట్టుకుంటారు హిహిహి...thanks for your comment