2/17/11

కల కానిదీ...




అనగనగా ఒక మామూలు అమ్మాయి. ఆ అమ్మాయి కలలు కూడా తన లాగే సాదా సీదా. తనకి కాబోయే భర్త, తను ముగ్గేస్తే చూసి ముచ్చట పడాలి, పాట పాడితే విని మురిసిపోవాలి, వంట చేస్తుంటే కూడా తిరుగుతూ కబుర్లాడాలి, ఇద్దరూ కవితలు, కధలు చదివి వాదించుకోవాలి ఇలా...తన తోటి అమ్మాయిల "costly" కలలతో పోల్చుకుని తనవి గగన కుసుమాలేం కావులే అని తృప్తి పడేది. అవి నిజం కావటం అంత కష్టమేమీ కాదని సంబరపడేది. ఒక శుభముహూర్తాన పెద్దవాళ్ళు ఒక చక్కటి అబ్బాయిని చూసి ఆ అమ్మాయికి పెళ్ళి చేసారు.

ఆ అమ్మాయి ముగ్గేసాను చూడమంటే, coffee late అయ్యిందని అలిగాడు అబ్బాయి, కూనిరాగం తీస్తే TV volume వినిపించట్లేదని విసుక్కున్నాడు, తనతో కబుర్లు చెప్పొచ్చు కదా అంటే నాకు బోలెడు పని వుందని కసురుకున్నాడు, తనకి నచ్చిన పుస్తకాలు చూపిస్తే పనికొచ్చే books చదవచ్చు కదా అని సలహా చెప్పాడు.
తన
కలలు, అంత మామూలు కలలు కూడా కల్లలైపోయాయని ఆ అమ్మాయి బోలెడు బాధ పడిపోయింది. కొన్నాళ్ళకి తనకి లాగే ఆ అబ్బాయికి కూడా కలలుండేవని తెలుసుకుంది. తన భార్య పేధ్ధ వుద్యోగం చేసెయ్యాలని, మారిపోతున్న technology ని ఎప్పటికప్పుడు అందిపుచ్చేసుకుంటూ వుండాలని, తను కట్టుకుంటున్న ఆశా సౌధాలకి చేదోడు వాదోడు గా వుండాలని...లాంటి కలలు అబ్బాయివి. ఇద్దరికి తమ Qualification లు ఒకటే కాని కలలు కన్న జీవితాలు వేరని అర్ధమయ్యి చాలా చింతించారు...తమ ఆశలు ఆవిరైపోయాయని దఃఖించారు...ఇద్దరికి ప్రపంచం శూన్యం అనిపించింది...ప్రపంచం లో తమంత దురదృష్టవంతులు లేరనిపించింది...తాము తప్ప అందరు సుఖసంతోషాలతో కళ కళలాడిపోతున్నారనిపించింది...ఫలితంగా పొరుగింటి గోడలకి బోలేడు చెవులు మొలిచాయి.

ఇదంతా గతం...ప్రస్తుతం లోకి వస్తే...

ఇప్పుడు ఆ అమ్మాయి పాట పాడితే చప్పట్లు కొట్టే ఒక చిన్నారి వుంది, కబుర్లు చెప్పుకోవటానికి తనకంటూ ఒక "circle" వుంది, తనకి నచ్చిన పుస్తకాలు చదివి చర్చించుకోవటానికి ఒక group వుంది. తన భార్య వుద్యోగం వేన్నీళ్ళకి చన్నీళ్ళలా తోడైంది కదా అని సర్దుకున్నాడు అబ్బాయి. వాళ్ళ ఇల్లు ప్రశాంతమైన ముంగిలి అయ్యింది...ఈ పరిణామానికి కారణం వాళ్ళిద్దరికి ఇప్పుడు యుధ్ధం కన్నా సంధి గొప్పదని, మాట కన్నా మౌనం లోనే శాంతి వుందని, గెలుపు కన్నా శాంతి మనసుకి ఎక్కువ హాయిని ఇస్తుందనీ తెలుసు. నవ్వుతూ కనిపించిన వాళ్ళందరూ సంతోషం గా వున్నట్టు కాదని తెలుసు. కష్టం అన్నది ప్రతీ జీవితం లో భాగమని తెలుసు. కలిసి బతకాలంటే ఇద్దరి కలలూ ఒకటి కావఖర్లేదనీ, ఒకళ్ళ కలల్ని ఇంకొకరు గౌరవిస్తే చాలని తెలుసు. కళ్ళు తెరిచి కనే కలలు తియ్యగావుంటాయి గాని అవి నిజం అయ్యి తీరాలనుకోకూడదని తెలుసు...జీవితం అంటే కల కాదని తెలుసు...

19 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

బాగా రాశారు. శీర్షిక కూడా చక్కగా కుదిరింది.
సూటిగా , క్లుప్తంగా, చక్కగా ఉంది. అభినందనలు.

Padmarpita said...

బాగుంది.

Anonymous said...

Well written..is this your personal experience? But anyways I believe your better half wants you to be a successful and a great achiever that could be one of the reasons......

veera murthy (satya) said...

స్పురిత గారు నమస్తే!

పొస్ట్ బాగుందండి, అలోచింప జెసేలా వుంది...

విశేషంగా ఈ రోజు కూడలి లో నలుగురు బ్లోగర్లు ఇదేవిషయం పై పోస్ట్ లు ఉంచారు....

ఇంకో విన్నపం మీ బ్లొగ్-టెంప్లేట్ ఒపెన్ కావడానికి చాలా సమయం తోసుకుంటుంది..దయ చేసి మార్చ గలరు

ధన్యవాదాలు

-సత్య

sphurita mylavarapu said...

మందాకిని,పద్మార్పితా వ్యాఖ్య కి ధన్యవాదాలు.

Anonymous, I wrote it in general

సత్యా, వ్యాఖ్యకి ధన్యవాదాలు. నేను template మర్చడానికి చూస్తాను ఖాళీ దొరికితే, కాని అది నాకు చాలా నచ్చిన template. నాకు ఎప్పుడూ మరి loading problem రాలేదు. ఈ అంశం మీదే ఇంకొన్ని post లు వచ్చాయన్నరు...కుదురితే కాస్త వాటి links పంపిస్తారా

మధురవాణి said...

నాకు చివరి పేరా చాలా నచ్చింది. సింపుల్ గా, సూటిగా చెప్పారు. :)
కానీ, నిజ జీవితంలో ఎందుకో ఇలాంటి విషయాలు చాలావరకు స్వానుభవం అయితే తప్ప అంత గట్టిగా బోధపడవు చాలామందికి.. అది మాత్రం చిత్రం కదా!

veera murthy (satya) said...

spuritha garu namste!


మీకిదే కవితా పోటీకి ఆహ్వానం

http://neelahamsa.blogspot.com/2011/02/open-challenge.html

-satya

కృష్ణప్రియ said...

స్పురిత గారు,

ఈ పెయింట్ బ్రష్ తఓ వేసిన చిత్రాలు నిజంగా బాగున్నాయి. నాకొక ప్రొఫైల్ పిక్చర్ వేసి పెట్టరూ?

Anonymous said...

Chaala practical gaa raasaru. I really liked it. Bahusaa chaala mandi couples ki idey situation face avuthundi.. But your conclusion is good. Keep writing more...

Sasidhar Anne said...

Chinna Tapa lo chala pedda information!!!!.. Chala baga rasaru.. okari kosam okaru gelusthu, oduthu vuntene kada.. jeevitham sukham ga sagipoyeddhi.

Sudha Rani Pantula said...

చిన్న టపాలో లోతైన వ్యాఖ్యానం.
ఆలోచన విధానంలోనో, హార్మోన్ల ప్రభావమో కాని అమ్మాయి, అబ్బాయి ఊహలు ఒకేలా ఉండవు.దానికోసం వారెంత ప్రయత్నం చేసినా.
మందాకిని గారన్నట్టు స్వానుభవం అయితే కాని తత్వం బోధ పడదు.
ఇదంతా గతం ప్రస్తుతానికి వస్తే....
ఇలా సింపుల్ గా రెండు లైన్లలో రాదుగా జీవితం... ఈలోపల మనసులోను బయట ఎంత గందరగోళం... ఇలా అయితే ఆ జీవితమో, ఆమనిషో అక్కర్లేదనుకోవడాలు...ఎన్ని జరిగిపోతాయి.
అమ్మాయి కలలు కడుపునింపేవి కాదుకదా అని అబ్బాయిలు వదిలేయకుండా వాళ్ళ చిన్న చిన్న ఆశలని తీర్చేస్తే బాగుండును.

Sudha Rani Pantula said...

స్వానుభవం గురించి మధురవాణిగారు చెప్పినట్టున్నారు.. మందాకిని అని రాసాను. సారీ..

ప్రవీణ said...

No two people are same in this world..enka man and woman dagagraku vachhesariki...nothing is common.
chala baga rasaru..

Unknown said...

హ్మ్ స్పురిత గారు చాలా నచ్చింది కాని .. ఎందుకో కొంచెం బాధ వేసింది ...

వెన్నెల్లో ఆడపిల్ల said...

నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది..
స్ఫురిత గారు మీ బ్లాగు నాకు చాల నచ్చింది. ధన్యవాదాలు ఇంత బాగా రాసి మాకు ఇచ్చినందుకు.. office లో మీ లాగే telugu blogs చూస్తూ మీ దానిలొకి enter అయ్యను. బాగా నచ్చి అన్ని చదివేసాను..

Sekhar Babu said...

Excellent!!! Especially the last paragraph protrayed the essence of life.

Sri said...

Sphuritha garu,

A very nice post...I really admire your writing skills...

I read some of your articles again and again and still enjoy the same...

Best Wishes,

Valli

యశోదకృష్ణ said...

ee roje mee blog choosanu. baagundi. main ga ee tapaa chaala baagundi. oka understanding ki vachhevaraku aa manasulu entha gharshana padathayo kada. mee narration baagundi. oka roju motham mee blog chadivi chepthanu inka em cheppalo.

please visit my blog.
bye.

కొత్తావకాయ said...

చాలా చక్కగా, సూటిగా, సత్యం చెప్పారు. అభినందనలు.