2/28/11

చిలకపలుకులు
చిన్నప్పుడు ప్రతీపిల్లలూ ముద్దు మాటలాడతారు...ప్రతీ బుడుగు మాటలు చాలావరకూ unique గానే వుంటాయి అనిపిస్తుంది నాకు. ఆ వయసులో వాళ్ళ సౄజనాత్మకి కొలతలు లేకపోవటం..మూసల్లో పోసి వారి తెలివితేటల్ని నియత్రించే బోధనా పధ్ధతుల్లో ఇంకా ఇరుక్కుపోకపోవటం కారణాలు కావొచ్చు. నా చిట్టి తల్లి ముద్దు మాటలు అది పెద్దదయ్యాక దానికి గుర్తు చెయ్యాలన్న ఆశతో ఇక్కడ దాచుకుంటున్నాను...మళ్ళీ మర్చిపోకుండా

వద్దా... మానై...

పగెడతానే...

నా నాన్న నిన్నే కొడతాడు.

మామ్మకి ఎన్ని మాటలొచ్చేసాయో!

hello అమానాన్నా తాతగారు అల్లరి చేస్తున్నారు కర్ర పెట్టి కొట్టెయ్

ఏం చేస్తున్నావ్ అని అడిగితే ...నేను బాగా అల్లరి చేస్తున్నాను(పాపం అస్సలు అబధ్ధమాడదు)

అదేంటి...దాని ప్రశ్న...అదీ table సమాధానం...టేబులా...మళ్ళీ అన్నీ confirm చేసుంటుంది


మౌక్తికా... అక్కడ నీళ్ళొంపేసింది( అది చేసిన పాడు పన్లన్నీ ఎవరో చేసినట్టు వాళ్ళ మామ్మకి కంప్లైంట్ లు)

పిల్లకి అస్సలు స్థిరం లేదు(వాళ్ళ మామ్మని imitate చేస్తూ)

మౌక్తిక కి కావాల్ట(దానికి ఏది కావాలన్నా, అది ఎం అల్లరి పనుకు చేసినా తోసెయ్యటానికి అది పెట్టుకున్న dummy...మళ్ళీ మౌక్తిక ఎవరూ అంటే నేనూ అని గుండెలమీద చెయ్యేస్కుని మరీ చూపించేస్కుంటుంది)

బావుందీ...(ఏం పెట్టినా నచ్చినా నచ్చకపోయినా మొదటి ముద్దకి మాత్రం పొగిడేస్తుంది...రెండో ముద్దనుంచీ ఆ తినిపించే వాళ్ళ పాట్లు ఇంక అడక్కండి)

కాకి బావా...కాకి బావా పాట బాగా పడతావేం అన్నాడు...ఏనుగూ తొండం తో బొబ్బ పోసేసిందీ...అనుమానూ(హనుమాన్) రాచ్చసి ముక్కూ చెవులూ కోసేత్తాడు(అది విన్న మూడు కథలు కలిపి తన సొంత కధ ఇలా అల్లింది...పైగా దాని ఉద్దేశం లో హనుమంతుడు సూర్ఫణఖ ముక్కూ చెవులూ కోసేస్తాడు)


జలుబు చేసి తగ్గాక...మళ్ళీ ice cream తింటావా అని కోప్పడితే...strawberry తిననా...(strawberry flavor తిననా) దాని సమాధానం

మామ్మా ice cream తినకూ, దగ్గొస్తుందీ...(మామ్మకి జాగ్రత్తలు బాగా చెబుతుంది)

చద్దక్కేది(శ్రధ్ధక్క)...బబ్బుంది...బబ్బుందా...దివ్యక్కేదీ...బబ్బుంది...బబ్బుందా
(రోజూ పడుకునే ముందు ఒక అరగంట సేపు దాని బుల్లి బుర్రలో వున్న database లో అందర్నీ తల్చుకుంటుంది...దాన్ని జోకొట్టే వాళ్ళు అలా అది పడుకునే దాకా సమాధానం చెప్తూనే వుండాలి)

16 comments:

Ennela said...

chaalaa chaalaa baagunnayandee chilaka palukulu..god bless chitti talli

లత said...

చాలా బావున్నాయండి.పెద్దయ్యక చూసుకుని మురిసిపోతుంది మీ పాప

Lakshmi Raghava said...

నిజంగా అల జరిగితే ....హా ..హా..

సుమలత said...

వెరీ నైస్ ఫోటో బాగుంది ;

Anonymous said...

Very cute , I feel bad for u that you are missing all her cute stuff.

Anyway, Hope she will be back with you soon.

Sree said...

for an instant other than the name everything seemed familiar :).. Sreya, my daughter also does the same.. she calls her self "vaadu" vaadu vastaadu, vaadu chestaadu, etc.. anoomaaan, gadha, sanjeevini juyy ani egiripoyaadu antundi :)..

chaala andamaina phase of life kadaaa idi...

Sasidhar Anne said...

maa annaya valla ammayi ki one year vuntundhi.. adhi podunne legichi.. "aaa" ani tega ragalu teesuthundhi..nadavatam kooda modalu pettesindhi..

mee tapa chusaka.. okkasari ga maa honey gurthuku vacchesindhi..

tethulika said...

మూసల్లో పోసి వారి తెలివితేటల్ని నియత్రించే బోధనా పధ్ధతుల్లో ఇంకా ఇరుక్కుపోకపోవటం కారణాలు కావొచ్చు -ఈ బోధనాపద్ధతుల్లో ఇంట్లో పెద్దలు కూడా అనుకుంటా పిల్లల సృజనాత్మకతకని తీరిచి దిద్దుతూ వాళ్ళని రొబొట్ గా చేసేసేవాళ్ళు.. మంచి విషయం ప్రస్తావించేరు. అబినందనలు. - మాలతి

Anonymous said...

man that was a good one..really

ప్రవీణ said...

మీ పోస్ట్ లు అన్ని చదివానండి. మనసుకి చాల హాయిగా ఉంది.. నన్ను నేను ఎక్కడో చదువుకుంటున్నట్లు ఉంది..సూపర్ గా రాస్తున్నారు మీరు

మిరియప్పొడి said...

బలె స్వీట్గా ఉంది.

ఒక స్తగె లొ పిల్లలు వాళ్ళని వాళ్ళు 3ర్ద్ పెర్సన్ లో రిఫర్ చేసుకుంటారు.

sphurita mylavarapu said...

వ్యాక్యానించిన అందరికీ ధన్యవాదాలు
@లక్ష్మీ రాఘవా, ఎలా జరిగితేనండీ??
@ మాలతి గారు, మీరన్నది నిజమేనండీ
@ప్రవీణ చాలా సంతోషం నా బ్లాగు అంతగా నచ్చినందుకు
@ మిరియప్పొడి, నిజమేనండీ...నా couosines మాత్రం నీ కూతురికి mulTiple personality వుంది అంటూ ఆట పట్టించారు :)

Unknown said...

ఎంత క్యుట్ గా ఉందొ .. :) మీ బుజ్జి తల్లికి హ్మ్ ఏమి చెప్పాలి దీవెనలు అది అని పాత చింతకాయ కబుర్లు చెప్పను కానీ .. నా ముద్దులు :)

Ram Krish Reddy Kotla said...

My kisses to Moukthika bangaram :-)

శిశిర said...

చాలా ముద్దుగా ఉన్నాయి మీ పాప మాటలు. :) చిట్టితల్లి కలకాలం చల్లగా ఉండాలని నా ఆశీస్సులు.

sphurita mylavarapu said...

kaavyaa, kishan & sisiraa thank you very much