7/13/10

మట్టి వాసన


సన్నగా మొదలైన వాన చినుకులు నెమ్మదిగా పెద్దవాన గా మారుతున్నాయి. వానని చూస్తూ వేడి వేడి Tea sip చేస్తూ నేనూ, నా roomie patio లో కూచున్నాం. మొహం మీద పడుతున్న నీటి తుంపరలు, ఎండిన మట్టి మీద పడ్డ వానచినుకుల్లోంచి పుట్టిన మట్టివాసన కలిసి మా కబుర్లలోకి ఎన్నో జ్ఞాపకాలని మోసుకొచ్చాయ్. వానా వానా వల్లప్పల గురించి, నీళ్ళ కాలువల్లో వేసిన కాగితం పడవలగురించి నేను చెప్తే...మొత్తం ఇంటిల్లిపాది తొలకరి జల్లులకి మురిసి తడిసిన సంగతులూ...వాన వస్తే చాలు అమ్మ చేసే వేడి వేడి పకోడీల సంగతులు తను నెమరు వేస్కుంది. ఇప్పుడు India లో వానలు పడుతున్నాయ్. ఇంటికి phone చేసినప్పుడల్లా పకోడీలు తిన్నాం ఇవాళ అంటున్నారు..అని బుంగమూతి పెట్టింది తను.చలో యార్ ఘర్ చల్తే హై అంది...రోజుకొకసారైనా ఆమాట అంటూనే వుంటుంది తను.

మన కలలు, ఆశలు వేరు...మనం పరిగెడుతున్న దిశ వేరూ...అనిపించింది. అదే మాట తనతో అన్నాను. అదేంటి అంది.వానొచ్చినప్పుడల్లా అమ్మచేతి పకోడీలు దొరుకుతుంటే మనం ఇంకేవో కలలు కంటూ వాటి వెనకాల పరిగెత్తాం...ఇప్పుడు ఆ పకోడీల వాసనలు కూడా మనకి కలలై కూర్చున్నాయి...కాని తమాషా ఏమిటంటే ఇప్పుడు ఆ కలని నిజం చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యటం లేదు మనం అన్నాను...

నువ్వింకా ఇక్కడ ఇలా మీ పాప కి...husband కి దూరం గా వుండి ఇంత కష్టపడి job ఎందుకు చేస్తున్నావో నాకైతే తెలియట్లేదు...హాయిగా అందరూ india వెళిపోయి settle ఐపోవచ్చు కదా అంది తను. నా సంగతి వదిలెయ్యి...ఇప్పుడు నా ఏ నిర్ణయం ఒక్క మనసు తో అలోచించి తీస్కునేది కాదు...దేనికైనా ఇద్దరి అభిప్రాయాలు కలవాలి...దానికి చాలా time పడుతుంది....నువ్వు single...ఏ నిర్ణయమైనా నీ ఇష్టం...దాని ఫలితం నీదే...రోజుకొకసారి india వెళ్దాం పద అంటావ్ కదా...హాయి గా వెళ్ళి అమ్మా నాన్నల తో enjoy చెయ్యొచ్చు గా అన్నాను...ఎప్పట్లాగే ఒక నవ్వు నవ్వి వూరుకుంది.

నవ్వు కొన్ని సార్లు సమాధానం ఐతే...కొన్ని సార్లు చెప్పలేని సమాధానం అవుతుందనిపించింది...

వాన జోరు బాగా పెరిగిపోయింది...మట్టి వాసనా కరిగిపోయింది...వాన ఇప్పుడంత ఆహ్లాదకరం గా అనిపించడంలేదనిపించి ఇద్దరం లోపలకి నడిచాం routine లో పడటానికి...

16 comments:

Sirisha said...

వానొచ్చినప్పుడల్లా అమ్మచేతి పకోడీలు దొరుకుతుంటే మనం ఇంకేవో కలలు కంటూ వాటి వెనకాల పరిగెత్తాం...ఇప్పుడు ఆ పకోడీల వాసనలు కూడా మనకి కలలై కూర్చున్నాయి...కాని తమాషా ఏమిటంటే ఇప్పుడు ఆ కలని నిజం చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యటం లేదు మనం chala baga chepparu ..sphurita garu

నేస్తం said...

మీరు భలే రాస్తారు స్పురిత మనసుకు హత్తుకునేలా :)

Sai Praveen said...

మీ posts చాలా touching గా ఉంటాయండి. ఈ టపాకు మొదలు,ముగింపు కూడా చాలా అందంగా ఉన్నాయి. Nice one.

స్థితప్రజ్ఞుడు said...

మీరు అమెరికా లో ఉండి ఎలా ఫీలవుతున్నారో...ఇక్కడ ఇండియా లో ఉండి నేను కూడా అంతే..

ఏదో మూడు నాల్గు నెలలకొకసారి ఇంటికి వెళ్తా గాని, మీరు రాసినవి నేను కూడా మిస్ అవుతుంటా...

అసలు ఎవరు వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర ఉంటున్నారండి??....ఉద్యోగం పేరుతో ఎక్కడో..

వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఆవకాశం దొరకనప్పుడు..అమెరికా లో ఉన్న ఒకటే అనకాపల్లి లో ఉన్నా ఒకటే...

భావన said...

జీవితం లో అన్ని ఫేజ్ లు స్పురిత. ఏది తప్పని ఫేజ్ లు. మరి రెక్కలొచ్చాక పరుగెడుతున్న ప్రపంచం లో ఇలాంటివి తప్పవు.. అమ్మ కొంగుపట్టుకుని తిరిగి పెడితే తిని, ఆ పైన అమ్మ కు సాయం చేసి ఆపైన మనమే అమ్మలమై, ఆ పైన మనమే పదిమందిని ఆహ్లాదపరచి మన చుట్టూ ఒక ప్రపంచం ఏర్పరుచుకుని అమ్మ నాన్న లు కూడా ఆ ప్రపంచానికి దగ్గర వుండటం కొందరి కే దొరికే అదృష్టం అనుకో :-( ఇవి అన్ని తప్పని దశలు కదా. తప్పదు మరి. ఇది పరుగెత్తటం కాదు జీవన్ విధానమయ్యింది. మంచి ఆలోచన తెచ్చారు. థ్యాంక్స్.

Sree said...

good blog here sphuritha... ikkadiki accidentalga vaccha... atukkupoyaa... love it to bits, keep writing.

sphurita mylavarapu said...

మురళీ, నేస్తం, ప్రవీణ్ మీ వ్యాఖ్యకి, అభిమానానికి ధన్యవాదాలు.
@స్థిత ప్రజ్ఞ్యుడు India లో వున్నా ఇలా జ్ఞాపకాలు నెమరేస్కుంటూ గడచిన కాలం తీయనిది అనుకోవల్సిందే అంటారు ఐతే. వ్యాఖ్తకి ధన్యవాదాలు
@భావనా, నిజమేనండి ఐనా అప్పుడప్పుడూ వానచినుకులు, మట్టివాసనలు అలా గతంలోకి లాక్కెళ్ళి చేజారిపోయిన రోజుల్ని గుర్తుకి తెస్తూ వుంటాయ్. ప్రస్తుతం లో బతకటం తప్పకపోయినా గతం మనసుని లాగుతూనే వుంటుందనిపిస్తుంది నాకైతే. వ్యాఖ్యకి ధన్యవాదాలు

శిశిర said...

చాలా హత్తుకునేలా రాస్తారు మీరు విషయమేదైనా. మీ బ్లాగుని మొదటి పోస్ట్ నుండి ఫాలో అవుతున్నా ఐ.డి తో కామెంటడం ఇదే మొదటిసారనుకుంటా. చాలా బాగుంటాయండి మీ రాతలు.

కొత్త పాళీ said...

మట్టివాసన పీల్చే వేళ ఒక మామూలు మనిషి మనసులో ముసిరే మూగభావాలకి చక్కటి అక్షర రూపం.
బాగా రాశారు

malathi said...

ఈమధ్య ఆచంట శారదాదేవి కథలు తెచ్చి చదువుతున్నాను. ఆవిడకథల్లో మట్టివాసన కాదు కానీ, వానా, మబ్బులూ, నక్షత్రాలూ, ఈదురుగాలీ .. చాలా ఆహ్లాదకరంగా వాడతారు. ఈతరంవాళ్లకి ఇలాటి ఆలోచనలు రావడం నాకు కాస్త కొత్తగానే ఉంది.
అందుకే వస్తున్నా ఇక్కడికి :) క్రమంగా ఇలాటివి కథల్లో కూడా పెడతారని ఆశిస్తూ ...
మాలతి.

శివరంజని said...

అమ్మ నాన్నల మీద బెంగెసిందే మీకు ....మనసుకు చాలా హత్తుకునేలా రాసారు

మనసు పలికే said...

చాలా బాగుందండీ.. నేను కూడా అనుకోకుండా వచ్చా మీ బ్లాగు లోకి. కానీ అన్నీ చదివేస్తున్నా.. క్షమించాలి, చదివింపజేసేలా ఉన్నాయి మీ టపాలు. :)
"వానొచ్చినప్పుడల్లా అమ్మచేతి పకోడీలు దొరుకుతుంటే మనం ఇంకేవో కలలు కంటూ వాటి వెనకాల పరిగెత్తాం...ఇప్పుడు ఆ పకోడీల వాసనలు కూడా మనకి కలలై కూర్చున్నాయి...కాని తమాషా ఏమిటంటే ఇప్పుడు ఆ కలని నిజం చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యటం లేదు మనం" ఎంత పచ్చి నిజం..!!

Unknown said...

మీ రాతలకు నా అభినందనలు..........
మట్టి వాసనంటే నాకు చాలా ఇష్టం, ఎంత ఇష్టం అంటే మా మగ కవలపిల్లల లొ ఒకడికి పృథ్వీ సౌగంధ్ అని పేరు పెట్టేంత గా.............
రెండో వాడి పేరెమిటా అనుకుంటున్నరా,ప్రణవగీత్ లెండి.

హను said...

మీ రాత చాలా బాగుందండీ.మనసుకు హత్తుకునేలా రాసారు.

Unknown said...

మట్టి వాసన మర్చి పోయిన నగర జీవీ కి
బానే గుర్తు చేసారు .ఇప్పుడు వాన పడితే
ఆస్వాదించడానికి మట్టి లేదు , గుంతల్లో
వాన నీరు నిండి , డ్రైనులు పొంగి గంటల తరబడి ట్రాఫ్ఫిక్ జాములు తప్ప .
అందుకే హైదరాబాద్ లో వాన పడితే సునామి వచ్చినంత ఉపద్రవాలు గుర్తుకొస్తాయి .
మట్టి వాసన గాలికి కొట్టుకు పోయింది .

Anonymous said...

Chaala baaga raasaaru....Idey 1st time mee blog ki raavadam. Varasa petti anni posts chaduvuthunna..Antha baaga raasaru..Actually nannu meelo choosukuntunnanu. Infact most of the desi women in US can see themselves in your posts.

Baaga adigaaru mee roomie ni. Eduti vaallaki ivvadanikey salahaalu, avi vaallaki apply kaavu. Sriranganeethulu antaaremo :)

Meeru ye post raasina, conclusion chaaga baaga isthaaru. Love ur blog.