7/2/10
మౌనమె నీ భాష ఓ మూగ మనసా...
ఈ పాట పాడే నా స్నేహితులంతా నన్ను ఏడిపిస్తూ వుండేవారు ఎప్పుడూ పెద్దగా మాట్లాడనని. మాట్లాడ్డం చేతకాకో, silent girl అన్నది compliment అనిపించో తెలీదు కాని పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. అందరూ చేరి ఏ విషయం మీదైనా వాదించేస్కుంటూ వుంటే నేను మాత్రం అందరి వాదనలూ వింటూ కూర్చుని చివరాఖర్న ఏదో ఒక comment పడేస్తూ వుండేదాన్ని. ఆ comment మాత్రం తిరుగు లేకుండా మళ్ళీ వాళ్ళెవరూ నోరెత్తలేకుండా వుండేది చాలా వరకూ. అందుకే silent killer అనే బిరిదు కూడా పడేస్తూ వుండేవారు అడగకుండానే. మా అమ్మ మాత్రం నాకు పూర్తిగా విరుధ్ధం. అవతలవాళ్ళకి ఎక్కడా అవకాశం కూడా ఇవ్వకుండా గలగలా మాట్లాడేస్తూ వుంటుంది. తనకి నేను ఎప్పుడూ వుచిత సలహా ఇస్తూ వుండేదాన్ని అలా అన్నీ మనం మాట్లాడేస్తే అడగకుండానే అవతలవాళ్ళకి మన సంగతులన్నీ తెల్సిపోతాయి, అదే నాకులా అవతలవాళ్ళ సొద అంతా విన్నావంటే వాళ్ళ లోటు పాట్లు అన్నీ మనం తెలిసేసుకోవచ్చు అని. నేను ఏం చెప్పినా వినే రకమా మా అమ్మ...తను నాకు అమ్మ గాని నేను తనకి కాదు కదా...ఎవరైనా మీరు చాలా silent అంటే I am a good listener అని సమర్ధించుకుంటూ వుండేదాన్ని. పెళ్ళయ్యాక మా అత్తారింట్లో వున్న కాసిన్ని రోజులకే చాలా నెమ్మది, పెద్దగా మాట్లాడదు అనే పేరు సంపాదించేసాను. ఇంక US వచ్చాక ఏమీ మాట్లాడవేంటి అసలు అని రోజుకొకసారైనా మావారు అంటూనే వుండేవారు. ఎవరింటికైనా వెళ్ళినా, ఏదైనా party కి వెళ్ళినా ఎవ్వరితో పెద్దగా కలిసేదాన్ని కాదు. ఎప్పుడూ మా వారి వెనకాలే తిరుగుతూ వుండేదాన్ని. ఎందుకు నాతోనే తిరుగుతావ్, కాస్త అందరినీ పరిచయం చేస్కోవచ్చుకదా, నీకూ ఒక circle అంటూ వుండాలి కదా అంటే వాళ్ళు మాట్లాడే చీరలు నగల Topics నాకు interesting గా లేవనో వాళ్ళు నా Age group కాదనో, నాకు నచ్చితే గాని నేను ఎవరితోనూ కలవలేను అనో ఎవో ఒక ఒంకర టింకర కారణాలు చెప్పి తప్పించుకుంటూ వుండేదాన్ని.
ఇదంతా మూడేళ్ళ కి ముందు. ఈమధ్య ఎప్పుడు మారానో నాకే గుర్తు లేదు గాని తెగ మాట్లాడుతున్నాను. మా వారు ఇంక ఆపు తల్లో అనే దాకా మాట్లాడుతున్నాను. ఈ Topic ఆ Topic అని లేదు, వీళ్ళు నాకు నచ్చారా నచ్చలేదా అని లేదు, నా కన్నా పెద్ద వాళ్ళా చిన్న వాళ్ళా అని లేదు. అందరితోనూ మాట్లాడేస్తున్నాను. అందరికి సలహాలు కూడా తెగ ఇచ్చేస్తున్నాను. ఒక్కోసారి phone లో మాట్లడే టప్పుడు అవతల వాళ్ళు ఏదైనా చెప్పబోతుంటే నా మాటలు పూర్తి అయ్యే దాకా వాళ్ళని మాట్లాడనివ్వకుండా మాట్లాడేస్తున్నాను. నాకే ఈమధ్య బాగా తెలుస్తోంది నాలో వచ్చిన మార్పు. ఎందుకు ఇంతలా మాట్లాదేస్తున్నాను...ఛీ మునుపట్లా Silent గా వుండాలి అని ప్రయత్నించినా నా వల్ల కావట్లేదు. ఒక్కోసారి నేను ఏమైనా insecurity feel అవుతున్నానా, దాని ప్రభావమా అని లేని పోని అనుమానాలు కూడా వచ్చేస్తున్నాయి.
మొన్న ఒకరోజు family Friends తో మా అమ్మాయి గురించి చెబుతూ India వెళ్ళిన వారం కాస్త బుధ్ధిగా వుంది. తర్వాత నెమ్మదిగా అల్లరి మొదలు పెట్టి ఇప్పుడు అందర్నీ అదుపులో పెట్టేసే level కి వెళ్ళి పోయింది, మొన్న మా ఆడపడుచుల పిల్లలంతా కలిసి అంత్యాక్షరి ఆడుతుంటే ఇది దీనికి తోచిన రాగాలు తీస్తూ వెనకాల కూర్చిందిట, కొంచెం సేపటికి తన పాటలు ఎవరూ పట్టించుకోవట్లేదనిపించి మిగిలిన పిల్లల్ని తోస్కుని ముందుకంటా జరిగి పోయి కూచుని దానికి ఆ పాటలు ఏమి రాకపోయినా..వాళ్ళు పాడే పాటలల్లోంచి ఏదో ఒక ముక్క పట్టుకుని గాఠ్ఠిగా గొంతుపెంచి దానికి నచ్చినట్టు రాగాలు తీస్తూ పాడేసిందిట అని చెప్తే...ఇక్కడ వుండగా ఎప్పుడైనా మా ఇంటికి వస్తే మీ వొళ్ళోంచి దిగేదే కాదు అక్కడకి వెళ్ళి అంత మారిపోయిందా అని ఆవిడ అంటుంటే...వాళ్ళాయన మాత్రం ఒక చక్కటి విశ్లేషణ ఇచ్చారు దాన్లో వచ్చిన మార్పుకి...అక్కడకి వెళ్ళి రెండు రోజులైనా తనకి బాగా తెలిసిన అమ్మా నాన్నా కనిపించలేదు, కాస్త తెల్సిన అమ్మమ్మ కూడా కనిపించటం మానేసింది...ఒహో ఇంక నేను వీళ్ళతోనే వుండాలి అనుకుంది...ఈ తెలియని వాళ్ళ మధ్య నెగ్గుకు రావాలంటే నా ఆధిక్యత చాటుతూ వుండాలి...అందరి దృష్టీ నా మీదే వుండాలి అని అందర్నీ తనే Dominate చెయ్యటం మొదలు పెట్టేసింది, అందుకే పిల్లల దగ్గర్నించి ఎన్నో management పాఠాలు నేర్చుకోవచ్చు అంటారు...మీ అమ్మాయికి అప్పుడే Struggling for Existence అంటే తెల్సిపోయింది అన్నారు...ఆయన మాటలు వింటుంటే నాకు తెలియకుండానే ఒక చిరునవ్వు నా పెదాలమీద..దానికి కారణం మౌనాన్ని అర్ధం చేస్కునే అంత తీరికి ఇప్పుడు ఎవ్వరికీ లేదని, మూగమనసులకి కాలం చెల్లిపోయిందని...నోరు పెట్టుకుని బతకాలని తెలుసుకోవటానికి నాకిన్నేళ్ళు పడితే నా కూతురికి రెండేళ్ళు నిండకుండానే తెల్సిపోయిందే అన్న ఆలోచన కావచ్చు...
Subscribe to:
Post Comments (Atom)
9 comments:
Very Well written sphurita garu. Sorry for commenting in English.
స్పురిత గారు చిన్నప్పుడు నేను కూడా మీలాగే.. పెద్దగా మాట్లాడేవాడిని కాదండి.. ఇప్పుడే పర్లేదు అనుకోండి :-).. అమ్మాయిలంటే అసలు తెగ సిగ్గేసేసేది చిన్నప్పుడు ఏంటో... ఇప్పుడు పర్లేదు అనుకోండి :-)... చాలా చక్కగా రాసారండి :-)
మా ఇంట్లో నేనూ, మా అమ్మ.. అచ్చంగా మీకు వ్యతిరేకం. బాగున్నాయి మీ కబుర్లు. ఆఖరి వాక్యం మనసుని తట్టినట్టుగా అనిపించింది :-)
:) నేనూ అంతే ఎక్కువ మాటాడలేను. నాకెవరైనా ఫోన్ చేస్తే, వాళ్లకి మాటాడ్డానికేం లేకపోతే, ఇహ చూడాలి ఆసీను. మంచి విషయం. ఎటొచ్చీ పాపకి రెండేళ్లకే తెలియడం హుమ్. కాలమహిమ :p.
అభినందనలు.
ఇంట్లో మీరు ,మీ అమ్మగారు లాగా మా ఇంట్లో నేను, మా చెల్లి. ఇదంతా ఒకప్పుడే లెండి.
బాగా రాసారు.
anonymous, కిషన్, మధురవాణి, మాలతి గారు, ప్రవీణ్ ఐతే నాకులాంటి వాళ్ళు చాలా మంది వున్నారన్నమాట. వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.
మాలతి గారు, ఇప్పటి పెద్దవాళ్ళకే కాదు పిల్లలకి కూడా ఎదుర్కోవలసిన పరిస్థితులు చాలానే వున్నాయనిపిస్తుంది నాకు. అందుకే వాళ్లకి బతకనేర్చిన తెలివితేటలు కూడా సహజం గానే వచ్చేస్తున్నాయేమో. మీరన్నట్టు కలికాలం..:)
ee blogprapanchaniki kothavadini.
Mee blog bavundi, kontha nerchukunela kooda undi..
naa blog ni kooda darsinchi, aseessulandajeyandi...
http://eeushakiranalu.blogspot.com/
మంచి విశ్లేషణ. చక్కగా రాస్తున్నారు. అభినందనలు.
@ కొత్తావకాయ...నా బ్లాగుకి స్వాగతం...
Post a Comment