5/13/10
తనకేం తెలుసు...
తనకి నచ్చినట్టు మళుపు తిరుగుతానంటుంది
ఎవ్వరి ఊసు పట్టదు కదా...
తనకి నచ్చిన పనులే చేస్తానంటుంది
ఎవ్వరి ఇష్టాఇష్టాలతో పని లేదు కదా...
ఎంత దూరమైనా ఒంటరిగానే వెళ్ళ్తానంటుంది
తోడులో ఉన్న తియ్యదనం తెలియదు కదా...
ఎవ్వరికోసం ఆగనంటుంది
బంధాల విలువ తెలియదు కదా...
ఏదో ఒకటి జరగనిదే అంగుళం కూడా జరగనంటుంది
మంచీచెడుల వ్యత్యాసం ఎరుగదు కదా...
ఎవ్వరి చేతికీ చిక్కనంటుంది
ప్రపంచమే తన గుప్పెట్లో వుంది కదా...
తను అందరికన్నా అందగత్తెనంటుంది
ఎప్పుడైనా అద్దం చూస్తే కదా...
అంతా తన వెనకే వస్తున్నారనుకుంటుంది
ఎప్పుడూ వెనుతిరిగి చూడదు కదా...
అంతా తన మాటే వినాలంటుంది
వినటం లో వున్న కష్టం తనకేం తెలుసు
కాలానికి బాసు లేడు కదా...
Subscribe to:
Post Comments (Atom)
9 comments:
బాగుందండి!
మీ కవిత బాగుందండి .
ఇక్కడ మిమ్మలిని పరిచయము చేసాను . చూసారా ?
http://sahiti-mala.blogspot.com/2010/05/blog-post_05.html
పద్మారిపిత గారూ, మాల గారూ ధన్యవాదాలు
నేను ఫస్టు చూసి మనసు గురించి అనుకున్నా.
very nice
nenu kooda mundu manasu gurinche anukunna.. last line is very good..
ayithe.. ee okka line daggara maathram chivara question mark petti vunte bagundunanipinchindi...
"ఎప్పుడైనా అద్దం చూస్తే కదా..."
Thanks,
శివ చెరువు
mee life chala bagundi...
school vishayalu chala nachaye..
cheyali ani kuda cheyaleka povadam...
eppudite elante addu undadu kadandi...adi cheyalanna cheyochu...
mee family lo writer unnaru kanuka meru vrayadam ledu...
mee manasu ki freedom undi kanuka meru ela wrastunnaru...andariki telisi wrasthara ante..
elani wrayandi....
cool ga unnaye
nice to meet u
మిరియప్పొడి గారూ, శివ గారూ అలా అనుకున్నారా, వ్యాఖ్యకి ధన్యవాదాలు.
Nakshatra, thanks for the comment and nice to meet you too.
"ముక్కోటి దేవతలకీ, అసలు సృష్టి మొత్తానికి కాలమే కదండీ బాస్..అందుకే మన కష్టాలు కాలానికి పట్టవు". చాలా బాగుందండీ కవిత.
@ప్రణీతా, ధన్యవాదాలు
Post a Comment