10/17/12

పుట్టినరోజు జేజేలు అరవై అయిదేళ్ళ పసి పిల్లాడికి




నేను పుట్టని క్రితం అమ్మా వాళ్ళూ పొదుపూ మదుపూ అనే బెంగలేమీ లేకుండా హాయిగా వుండేవారట...అలాంటి రోజుల్లో అమ్మ ఒక వారం gap లో రెండు జతల చెప్పులు కొనడం చూసి మా తాతగారు(అమ్మా వాళ్ళా నాన్నగారు) మా నాన్నతో మీకు అరడజను మంది ఆడపిల్లలు పుడితే తెలుస్తుందయ్యా డబ్బు విలువా అని కోప్పడారట. అప్పటికే పిల్లలు లేరని బెంగ పడుతున్న నాన్నగారు...మీ నోటిమాటన అలానే పుడితే బోల్డు సంతోషం అన్నారట.

ఇది జరిగిన చాలా ఏళ్ళకి నేను పుట్టగానే మా తాతగారు ఇన్నాళ్ళ ఎదురుచూపులకి "ఆడపిల్ల"పుట్టిందని నీరసం గా telegram ఇస్తే..మా నాన్నగారు మాత్రం ఎగిరి గంతేసి మహదానందం గా చదువుకుని పరిగెట్టుకుని వచ్చారట నన్ను చూడ్డానికి.

అది మొదలు ఎప్పుడూ నేను ఆడపిల్లని కాబట్టి అన్న feeling నాలో ఏ మూలా కలగకుండా పెంచారు నాన్న. చదవకపోతే అంట్లు తోముకుంటావ్ అని అమ్మ వెంట పడేదే గానీ నాన్న మాత్రం దానికి తెలుసు ఎప్పుడు చదువుకోవాలో అని ఒక్క మాట అనేవారు. ఆ ఒక్కమాటే నాకు బోలెడు responsibility నేర్పింది. school లో బెత్తం పట్టుకుని దబదబా బాదేసే మాస్టార్ల కన్నా...చిన్న మాట కూడా అనకుండా పిల్లల్లో బోలెడంత గౌరవాన్ని సంపాదించుకున్న ఆయన నడవడిక reserved గా వుండటంలోని గొప్పతనాన్ని నేర్పించింది. జీవితంలో అప్పు అన్నది చెయ్యకుండా బతికిన ఆయన జీవన విధానం Life planning నేర్పించింది. అల్ప సంతోషి అని అమ్మ ఎప్పుడూ కసురుకున్నా...చిన్న విషయానికే సంబరపడే ఆయన తత్వం సంతృప్తి లో వుండే ఆనందం, దాని విలువా తెలియజెప్పింది. ఒక వయసు వచ్చాక వాళ్ళకి తెలుసు career planning అని ఎప్పుడూ ఇది చదువు..ఇలానే చెయ్యి అని నిర్బంధించకుండా ఆయన నాకిచ్చిన స్వేఛ్చ నాకు పిల్లల్ని ఎలా పెంచాలో నేర్పించింది.


ఇన్ని నేర్పినా ఏనాడూ నీకింత చేసాను అని గొప్పలు చెప్పుకోని ఆయన వ్యక్తిత్వం నుండి నేర్చుకోవాల్సినది ఇంకా బోలెడంత.

ప్రతీ కూతురికీ నాన్నే మొదటి హీరో...ఇవాళ్టితో అరవై అయిదేళ్ళు నిండుతున్న (ఎప్పటికీ నా దృష్టిలో హీరో) నాన్న కి పుట్టినరోజు శుభాకాంక్షలు

16 comments:

శిశిర said...

నా తరపున కూడా మీ నాన్నారికి పుట్టున రోజు జేజేలు.

శ్రీరామ్ said...

మీ "హీరో" కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

Nice post !!

మాలా కుమార్ said...

mee naannagaari ki janmadina subhaakaankshalu .

పరిమళం said...

నాన్నగారికి పుట్టినరోజు జేజేలు.

Unknown said...

mere chala adrushtavanthulu mee naanna gariki janmadina subhakaankshalu theliyajeyandi

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగా రాశారండీ.. మీ నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

శ్రీలలిత said...


మీ నాన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...

జ్యోతిర్మయి said...

మీ మనస్సులో తన స్థానాన్ని నిలుపుకున్న మీ నాన్నగారికి అభినందనలు, పుట్టినరోజు శుభాకాంక్షలు.

రాజ్ కుమార్ said...

మీ నాన్నారికి పుట్టిన రోజు శుభాకాంక్షలండీ.

Sree said...

mee hero pasi pillaadiki maa tarapuna kooda subhaakaankshalu teliyacheyyandi.

Sravya V said...

మీ "హీరో" గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు !

Priya said...

Chala Bavundi...Mee Nannagariki Janmadina Subhakankshalu...

Priya said...

చాలా బాగా రాసావు. నా తరపున కూడా మీ నాన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయి.

మధురవాణి said...

@ స్ఫురిత గారూ,
మీ నాన్నగారికి నా తరపున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి..
పిల్లల కోసం ఎదురు చూపులు, ఎప్పుడూ ఆడపిల్లని కాబట్టి అన్న ఫీలింగ్ రానివ్వకపోవడం, స్వేచ్ఛలోంచి నేర్పించిన బాధ్యత.. వీటన్నీటికి సేమ్ పించ్..
నిజమే.. ప్రతీ అమ్మాయికీ నాన్నే మొదటి హీరో.. :)

sphurita mylavarapu said...

మా నాన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు అందజేసిన మిత్రులు

శిశిర గారూ, శ్రీరాం గారూ, మాలా కుమార్ గారూ, పరిమళం గారూ, రమేష్ గారూ, వేణూ గారూ, శ్రీలలిత గారూ, జ్యఒతిర్మయి గారూ, రాజ్ కుమార్ గారూ, శ్రీ గారూ, శ్రావ్యా, ప్రియా గారూ, మధురా

అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు

జయ said...

మీ నాన్న గారికి నా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలండి. మీకు కూడా అభినందనలు.