6/1/11

ఈ ప్రశ్న కి మీ జవాబు...?



రాయిని, రప్పని పూజించగలిగిన మనిషి,
చెట్టుమీదా, పుట్టమీదా జాలిపడగలిగిన మనిషి,
చదువుని, పదవిని అమితంగా ఆరాధించగల మనిషి,
పాటల్నీ, ఆటల్నీ అభిమానించగల మనిషి,
కాగితపు కట్టల్నీ, లోహపు ముద్దల్నీ ప్రాణాధికంగా ప్రేమించగల మనిషి,
మృగాన్ని కూడా అక్కునచేర్చుకోగలిగిన మనిషి,
సాటి మనిషి విషయంలో మాత్రం ఎందుకంత కర్కశంగా మారిపోతాడు?
తోటి మనిషి గెలుపు చూసి ఎందుకంత గింజుకుంటాడు?
ఎదుటి మనిషి ఆవేదన చూసి ఎందుకంతానందిస్తాడు?
సాటి మనిషి నిస్సహాయతని ఎందుకంత అవహేళన చేస్తాడు?
నా మెదడుని తొలిచేస్తున్న ఈ ప్రశ్నలన్నింటికీ నా బుర్రకి తట్టిన ఒకే ఒక్క సమాధానం
మిగిలిన వేటితోనూ వీడికి పోటీ, పోలికా లేవు కాబట్టి...
మరి మీ జవాబు?

3 comments:

Anonymous said...

ఎందుకంటే పదవి, చదువు, ఆటలు, పాటలు మనిషిని రంజింపజేస్తాయి. మన తోటివాడు వాటిని ఎంత అనుభవిస్తాడో మనం అంతే అనుభవిస్తాము. కానీ తోటివాడి ఆనందం వాడికి మాత్రమే. దానివల్ల మనకి ఒరిగేదేముంది? మనకీ అదే ఆనందం అందితే బాగుణ్ణు అన్న ఆలోచన తొలిచివేస్తుంది. అదే ఆలోచన మనకంటే వాడు తక్కువలో ఉన్నప్పుడు సంబరపడేట్టు చేస్తుంది. ఓర్వలేనితనము మనిషి సహజ లక్షణం. దాన్ని జయించగలటం గొప్ప విషయం. అందుకే మదర్ తెరెసా, గాంధీజీ, పొట్టి శ్రీరాములు వంటివారు మహానుభావులు అనిపించుకున్నారు. పరుల సంతోషం కోసం స్వలాభం చూసుకోకుండా, అందరు నావారే అని పాటు పడ్డారు కాబట్టి.

మురళి said...

బాగుందండీ...

Pavani said...

Arishadvarghalu manishi lone vunnayi. Migathavaatiki levu kaabatti.