12/18/10

స్పందన మరిచిన హృదయం


అమ్మ మొదటి సారి Hostel లో వదిలి వెళ్ళినరోజు...గుండె గొంతుకలోకి వచ్చినట్టనిపించి కళ్ళలో నీరు తప్ప నోట మాట రాని తను...అందరినీ వదిలి US వెళ్ళే రోజు అమ్మకే ధైర్యం చెప్పి Flight ఎక్కుతూ తనకి ధైర్యం పెరిగిపోయిందని మురిసి పోయింది

కళ్ళు మూస్తే చాలు భారత్ లో తను తిరిగిన చోట్లు, తనవాళ్ళు గుర్తుకొచ్చిన రోజుల్లోంచి...ఇవాళ్టి గురించిన అలోచన...రేపటి గురించిన బెంగలు తప్ప నిన్నటి సంగతులు కూడా గుర్తు రావట్లేదని తట్టి తను practical ఐపోయానని సంతోషించింది

తను చెయ్యని తప్పుకు boss తిట్టిననాడు తిండీ నీళ్ళు మాని ఏడ్చిన తను...తన తప్పు కూడా పక్కవాడి మీద తోసేసిన రోజు బతకటం నేర్చేసుకున్నా అని సంబరపడిపోయింది

విజయం సాధించడం కన్నా...దాని కోసం మనం ఎంచుకున్న మర్గమే ముఖ్యమని నాన్న చెప్పిన సూక్తులు మర్చిపోగలిగిన నాడు గెలుపు సూత్రాలు వంటబట్టించుకున్నానని గర్వపడిపోయింది

కానీ ఈరోజు...Traffic jam కి కారణం ఏవిటా అని car window లోంచి చూసిన తనకి పెద్ద accident, రక్తం మడుగులో పడివున్న మనిషి కనపడగానే...oh shit...today I am gonna miss the meeting అనుకున్న వెంఠనే ఒక్క క్షణం గుండె కలుక్కు మన్నట్టనిపించింది...

సెలవలకి వూరెళుతూ తను పెంచిన మొక్కకేమవుతుందో అని బెంగెట్టుకున్న తన చిన్ని గుండె...TV లో ప్రమాదం చూసినా కళ్ళు మూసేసుకునే తన గుండె...చిన్ననాటి స్నేహితురాలి మరణ వార్త విని కన్నీరు మున్నీరుగా విలపించిన తన సున్నితమైన గుండె...స్నేహితుడి interview sucess కావాలని దేవుణ్ణి ప్రార్ధించిన తన వెన్నలాంటి గుండె...ఇంత బండరాయైపోయిందా అని తల్చుకోగానే...భగవంతుడా ఎదగడమంటే గుండె బండబారిపోవటమే ఐతే ఇంక చాలు అనుకుంది...
స్పందన మరిచిన హృదయం ఒక్కసారిగా కరిగి కను సన్నల్లో కన్నీటి చుక్కైంది...

11 comments:

బులుసు సుబ్రహ్మణ్యం said...

బాగుందండీ. మన మనస్తత్వాలలో ఇంతటి మార్పు ఎందుకు ఎల్లా వస్తోందో? చాలా విచారకరమైన పరిణామం ఇది. Progress has a price to pay అంటారు ఇందుకే నేమో.

Anonymous said...

మీ వయసెంతో తెలీదు. కానీ ఇటువంటి స్పందన కరువైందని మనసు బాధపడిన సందర్భాలు ఈ జీవితంలో ఎన్నో.వద్దు. కొద్దిపాటి సంతోషాలను దూరం చేసుకుని మళ్లీ మళ్లీ బాధ పడి ప్రయోజనం లేదు. మీకంటూ కొంత స్పేస్ ని మీకోసం ఏర్పరుచుకోవాలి. అప్పుడే చిన్ని చిన్ని సంతోషాలు మనసుకు.

వేణూశ్రీకాంత్ said...

నాకు తెలియకుండానే నేను ఇలా మారిపోయానేంటో అని బాధపడ్డ ఇలాంటి సంధర్బాలు ఎన్నో.. చాలా బాగారాశారు.

Sai Praveen said...

చాలా రోజుల తరవాత కనిపించారు.
చిన్న చిన్న టపాలతో , తేలికైన పదాలతో గుండెని తాకేలా రాసే మీ శైలి నాకు చాలా ఇష్టం.
కొంచెం తరచుగా రాయటానికి ప్రయత్నించమని మనవి.
మీ పాప ఎలా ఉంది?

మాలతి said...

పైన వ్యాఖ్యలో చెప్పినట్టు చిన్న చిన్న మాటల్లో చాలా బారువైన విషయాలని ప్రస్తావించారు. అద్ఛుతంగా.
- మాలతి

మురళి said...

ప్రతి ఒక్కరూ తమని తాము తరచి చూసుకునే టపా..

HarshaBharatiya said...

oka nimisham kallaloki neellu vachay..
chala baga rasaru

కృష్ణప్రియ said...

చాలా బాగా చెప్పారు.. బండపడిపోవడం గురించి.. Very nice.

Anonymous said...

Eee rojullo manaloni Delicacy/Sensitivity anedi manaki teleekundaney disappear aipothundi.

Chaala chakkaga chepppaaru..nice post

Mani said...

భగవంతుడా ఎదగడమంటే గుండె బండబారిపోవటమే ఐతే ఇంక చాలు...

Unknown said...

భగవంతుడా ఎదగడమంటే గుండె బండబారిపోవటమే ఐతే ఇంక చాలు అనుకుంది...
no words
మనసు మూగబోయినట్టుగా ఉంది ఈ వాక్యం చదువుతుంటే