2/17/10

మా పల్లె అందాలు

కను విందైన ఉషోదయాలు, కోడి కూతల సుప్రభాతాలు, తొలకరి మట్టి వాసనలు, ఎర్రగా పండిన గోరింటాకు చేతులు, వెచ్చ వెచ్చని బావి నీళ్ళు, పెరళ్ళ లో ఆడిన గుజ్జిన గూళ్ళు, బంతి పూల కమ్మని వాసనలు, వేప చెట్ల తీపి గాలులు, రంగవల్లులూ, గంగిరెద్దులూ, హరిదాసుల తో కలిసి వచ్చే సంక్రాంతులు వీటి మధ్యనే గడిచింది నా చిన్న తనమంతా. ఆ సుద్ధ పల్లెటూరిలో చదివించి దాని భవిష్యత్తు నాశనం చేస్తున్నావన్న ఎందరో శ్రేయోభిలాషుల సలహాలు పెడ చెవిన పెట్టడం లో గెలిచిన మా నాన్నగారి మమకారం వల్ల బాల్యపు తీపిని, స్వేచ్చనీ, స్వచ్చమైన ప్రకృతిని పూర్తిగా ఆస్వాదిస్తూ పెరిగే అవకాశం నాకు కలిగింది.

నా ప్రాధమిక విద్యాభ్యాసం అంతా దంగేరు అనే వూరిలో జరిగింది. మా నాన్నాగారు కూడా అక్కడి ఉన్నత పాఠశాల లోనే తెలుగు మాస్టారుగా పని చేసేవారు. ఆ ఊరిలో నేను పుట్టక పోయినా, అది మా సొంత వూరు కాకపోయినా ఎక్కువ కాలం అక్కడ వుండడం వల్ల ఆ వూరి పేరు చెప్పగానే మా వూరు అనే వస్తుంది నా నోటి వెంట.

snow falls, fall colors, cherri blosoms మధ్య కొట్టుకు పోతున్న నన్ను, ఈ మధ్య చూసిన మా వూరి ఫొటోలు కొన్ని తట్టి లేపాయి.

గత నెల 14, సంక్ర్రాంతి పండగ రోజున మా school లో ఒక old students meet ఏర్పాటు చేసి గత 53 సంవత్సరాల పూర్వ విద్యార్థులంతా కలిసి, జ్ఞాపకాల్ని కలబొసుకునే అపూర్వ అవకాశాన్ని కల్పించారు. నేను దానికి స్వయం గా హాజరు కాలేకపొయినా మా నాన్నగారి వర్ణన, ఫొటోలు కలిసి మా వూరు వెళ్ళిన అనుభూతి కలిగించాయి.

మా వూరి అందాలు మీ తో కూడా పంచుకోవాలని కొన్ని ఫోటో లు ఇక్కడ పొందు పరిచాను...


ఫొటోలు: శ్రీ మైలవరపు చంద్ర శేఖర్ సాక్షి పత్రిక జర్నలిస్ట్




















10 comments:

మధురవాణి said...

అబ్బా.. ఎంతందంగా ఉందండీ మీ ఊరు..! ఈ ఫోటోల్లోనే కాదు.. మీ మాటల్లో కూడా మీ ఊరి అందమంతా నింపి చూపించారు :-)

మధురవాణి said...

Sphuritha garu,

please remove 'word verification' option in your comment settings. It makes us easy to comment in your blog.

sphurita mylavarapu said...

మధుర వాణి గారూ...

ఈ రోజు నా బ్లాగు లో మీ వ్యాఖ్యలు చూసి చాలా సంతోషించాను...మీ సలహాలకు కృతజ్ఞతలు. తప్పక పాఠించడానికి ప్రయత్నిస్తాను

మాలతి said...

snow falls, fall colors, cherri blosoms మధ్య కొట్టుకు పోతున్న నన్ను, ఈ మధ్య చూసిన మా వూరి ఫొటోలు కొన్ని తట్టి లేపాయి. - భలే చెప్పారండీ. నన్ను చాలా ఆకట్టుకున్న చిత్రాలు 3, 6.7,10. అంటే మిగిలినవి బాగులేదని కాదు. :)
- మాలతి

Anonymous said...

nice blog. i am also from est godaavari dist.

ravulapalem nundi.. currect gaa cheppaalante RYALI.

now working in AP TRASCo.,
my blogs
www.voiceofjasmine.blogspot..com

malli said...

adbhutamga vundi vuru

కొత్త పాళీ said...

very nice

Sai Praveen said...

చాల బాగుందండి మీ ఊరు. వెంటనే మా ఊరు గుర్తొచింది.

రాధిక(నాని ) said...

నేను రాజమండ్రిలో చదివేటప్పుడు దంగేరు అమ్మాయిలు చాలా మంది ఉండేవారు.వాళ్ళలో చిట్టి అని మాబెస్ట్ ఫ్రెండ్ ఉంది .ఇప్పటికీ కలుస్తూంటాము.నేను ఒకసారి వచ్చానుకూడా.ఫొటోలు బాగున్నాయండి.అక్కడ సంక్రాంతికి ప్రభలు కట్టి బాగా చేస్తారుకదా.

Unknown said...

మీ పల్లె అందం అంతా మీ మాటల్లో కనిపించింది.