5/11/10

ఈ క్షణాన్నిఆస్వాదించి ఎన్నినాళ్ళైంది...






ఈ క్షణాన్ని ఆస్వాదించి
ఎన్ని నాళ్ళైంది...

ఈ క్షణం మంచిదైతే
మరు క్షణం మీద బెంగ...
గడచిన క్షణం గురించిన నిరాశ

ఈ క్షణం చెడ్డదైతే
గడచిన క్షణం తో పొల్చి ఆవేదన
రాబోయే క్షణాన్ని తలచి అలోచన

ఆశ నిరాశల పోరాటం తెలియని ఆ క్షణం...

గతాన్ని తలచి వగచడం
భవిష్యత్తు కి వెరవటం
తెలియని ఆ క్షణం...

చివరి సారిగా చూసింది
జీవితపు తొలి పొద్దులో, బాల్యపు నీరెండలో అని గుర్తు...

ఈ మిట్టమధ్యాహ్నం మండుటెండలో
కళ్ళు చించుకుని వెతికినా ఎక్కడా జాడ లేదు...

ఎప్పుడు చేజారిందో మరి...గురుతే లేదు

10 comments:

మధురవాణి said...

చాలా చాలా బాగా చెప్పారండీ! గొప్ప వాస్తవం.. ఏంటో.. ఇలా అనుకుని కాసేపు ప్రస్తుతంలో బ్రతుకుదాం అనుకోవడం.. మళ్ళీ కుక్క తోక వంకరన్నట్టు.. అవే ఆలోచనలూ..ఆందోళనలూ.. ప్చ్.. :-(

కొత్త పాళీ said...

బాగా చెప్పారు

sphurita mylavarapu said...

@ మధురవణీ, ధన్యవాదాలు. ఎందుకో నిన్న చీ ఎమిటీ ఎప్పుడూ ఏవో అలోచనలూ, ఆందోళనలతోనే సరిపోతోంది అన్న అలోచన కలిగినప్పుదు ఇలా రాయాలనిపించింది.

@ కొత్తపళీ, మీ వ్యాఖ్యే పెద్ద certificate అని ఈ బ్లాగు ప్రపంచం లో అనుకుంటుంటే విన్నాను. మీ రాకతో నా బ్లాగు ధన్యమైంది ఈరోజు. :)

కొత్త పాళీ said...

అదేమి లేదండి. ఏదో వాళ్ళ అభిమానం కొద్దీ కొంతమంది గురూ అంటూంటారు.
I am like everybody else.

జ్యోతి said...

అన్ని క్షణాలను గుర్తుపెట్టుకోండి. మంచి క్షణాలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి, చెడ్డ క్షణాలు మీకు మరచిపోలేని పాఠాలు నేర్పిస్తాయి. కాని వీటిని తలుచుకుంటూ నిలిచిపోక సాగిపోతుండాలి. ముందు ముందు అన్నీ మరచిపోలేని మంచి క్షణాలే ఉండాలనే ఆశతో,ఉత్సాహంతో అడుగేయండి.

sphurita mylavarapu said...

జ్యోతి గారూ, వ్యాఖ్యకి ధన్యవాదాలు.
అన్ని క్షణాలు గుర్తూ వుంటున్నాయి, పాఠాలూ, గుణ పాఠాలు కూడా నేర్పుతున్నాయి. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమీ తెలియని అమాయకత్వం తో వాటిని ఆస్వాదించినంతగా ఇప్పుడు అన్నీ తెలుసునన్న మూర్ఖత్వం లో ఆస్వాదించలేకపోతున్నా అని అంతే

Anonymous said...

Sphuritha garu,

Nice one. Same feeling vachinappudu nenu kooda oka kavitha raasinatlu gurthu. But it was a bit violent compared to your style. Very contrasting. Thats why I loved your kavitha.

-Hemanth

sphurita mylavarapu said...

Hemanth,

Thanks for your appreciation...

Sai Praveen said...

"జీవితపు తొలి పొద్దులో, బాల్యపు నీరెండలో " - వాహ్!
చాలా బాగా రాసారు.
Need your comments on http://saipraveen-telugu.blogspot.com/2010/06/blog-post.html

Indian Minerva said...

Wow!!