5/11/10

ఈ క్షణాన్నిఆస్వాదించి ఎన్నినాళ్ళైంది...


ఈ క్షణాన్ని ఆస్వాదించి
ఎన్ని నాళ్ళైంది...

ఈ క్షణం మంచిదైతే
మరు క్షణం మీద బెంగ...
గడచిన క్షణం గురించిన నిరాశ

ఈ క్షణం చెడ్డదైతే
గడచిన క్షణం తో పొల్చి ఆవేదన
రాబోయే క్షణాన్ని తలచి అలోచన

ఆశ నిరాశల పోరాటం తెలియని ఆ క్షణం...

గతాన్ని తలచి వగచడం
భవిష్యత్తు కి వెరవటం
తెలియని ఆ క్షణం...

చివరి సారిగా చూసింది
జీవితపు తొలి పొద్దులో, బాల్యపు నీరెండలో అని గుర్తు...

ఈ మిట్టమధ్యాహ్నం మండుటెండలో
కళ్ళు చించుకుని వెతికినా ఎక్కడా జాడ లేదు...

ఎప్పుడు చేజారిందో మరి...గురుతే లేదు
Post a Comment