5/13/10

తనకేం తెలుసు...తనకి నచ్చినట్టు మళుపు తిరుగుతానంటుంది
ఎవ్వరి ఊసు పట్టదు కదా...

తనకి నచ్చిన పనులే చేస్తానంటుంది
ఎవ్వరి ఇష్టాఇష్టాలతో పని లేదు కదా...

ఎంత దూరమైనా ఒంటరిగానే వెళ్ళ్తానంటుంది
తోడులో ఉన్న తియ్యదనం తెలియదు కదా...


ఎవ్వరికోసం ఆగనంటుంది
బంధాల విలువ తెలియదు కదా...

ఏదో ఒకటి జరగనిదే అంగుళం కూడా జరగనంటుంది
మంచీచెడుల వ్యత్యాసం ఎరుగదు కదా...

ఎవ్వరి చేతికీ చిక్కనంటుంది
ప్రపంచమే తన గుప్పెట్లో వుంది కదా...

తను అందరికన్నా అందగత్తెనంటుంది
ఎప్పుడైనా అద్దం చూస్తే కదా...

అంతా తన వెనకే వస్తున్నారనుకుంటుంది
ఎప్పుడూ వెనుతిరిగి చూడదు కదా...

అంతా తన మాటే వినాలంటుంది
వినటం లో వున్న కష్టం తనకేం తెలుసు
కాలానికి బాసు లేడు కదా...
Post a Comment