3/14/10

అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఒక చిన్న కవితతో

ఉగాది పచ్చడి చేద్దామంటే వేప పువ్వు ఏది
అనుకుంటే మెంతులు వున్నాయిగా బదులుగా

నానమ్మలకీ, అమ్మమ్మలకీ బదులుగా Nany లు వున్నట్టు

మావి చిగుళ్ళు కనపడని చోట మేము మాత్రం ఎందుకు
వినపడతాం అన్నాయి కోకిల రాగాలు

పేరు తెలియని పక్షుల కిలకిలా రావాలు ఉన్నయిగా
బదులుగా అని సంబరపడ్డాను

స్వదేశపు కాంక్రీట్ జంగిళ్ళకి ఆ భాగ్యమూ లేదు మరి !!

ప్రత్యామ్నాయాలతోనే సరి, పండగ జరుపుకున్నంత కాలం
Happy New year తో పాటు గా సంవత్సరాది శుభాకంక్షలూ మిగులుతాయి

అమ్మ చేతి ఉగాది పచ్చడి జ్ఞాపకాల తడి ఇంకనంత వరకూ
ప్రతి తెలుగు గుండెలోనూ నవవసంత రాగాలు సందడి చేస్తాయి.

3 comments:

విశ్వ ప్రేమికుడు said...

ఆ తడి ఈ తరం వరకు ఇంకదు. కానీ తరువాతి తరాలకు ఇంకిపోకుండా ఉండాలంటే "అమ్మ" లె నడుంకట్టాలి మరి. :)

sphurita mylavarapu said...

@ విశ్వప్రేమికుడు, నాన్నల బధ్యతేమీ ఉండదని తేల్చేసారు మొత్తానికి :)

హను said...

eppaTiki maradu lenDi, ala ane aaSiddaam