4/4/11

ఎన్నాళ్ళో వేచిన ఉదయం...

తెల తెలవారుతూ వుండగానే నిద్ర లేచి...స్నానం చేసేసి...దేవుడికో దణ్ణం కూడా పెట్టేస్కుని...వేడి వేడి coffee mug చేత్తో పట్టుకుని balcony లో కూచుని చిరు చలికి చిన్నగా వణుకుతూ మళ్ళీ కొత్తగా పుట్టేస్తున్న బాలభానుడిని చూస్తూ మధ్య లో వేడి coffee గుటకలు వేస్తూ ఎర్రటి ఆకాశాన్నీ..తొలి వెలుగు రేఖల్నీ...నీరెండ పడి వొళ్ళు విరుచుకుంటున్న మొక్కల్నీ చూడాలన్నది ఎప్పట్నుంచో నా కల...ఏవిటీ ఇది కూడా కలేనా అని పెదవి విరిచేస్తున్నారా...ఐతే మీరు తప్పకుండా IT (information technology) లో పని చెయ్యట్లేదన్నమాట...ఈ conditions అన్నీ కలిపి ఆస్వాదించిన రోజు నాకైతే గుర్తు లేదు మరి. ఈ కలని నిజం చేస్కోవటానికే ఎప్పుడు ఇల్లు మారినా balcony వుండి తీరాలని పట్టు పట్టేదాన్ని. మేము వున్న చోట బాల్కనీ అంటే luxury లోకి వస్తుంది మరి...దానికి మళ్ళీ కాస్త వడ్డింపు ఇంకో లడ్డూ కావాలా నాయనా అనుకుంటూ. balcony వున్న ఇల్లు ఐతే తీస్కుంటాం గాని అంత పొద్దున్నే లేచిన పాపాన్నైతే పోలేదు ఇప్పటివరకూ. ఎలాగూ ఈ దేశం లో 6 నెలలు చిరు చలి వుండదు...అంటే చలి ఉండదని కాదు, భయంకరమైన చలి వుంటుంది...అప్పుడు balcony లో కూచుని coffee తాగటం అన్నది కల కాదు..సాహసం అవుతుంది...అంటే అప్పుడు నేను పొద్దున్నే నిద్ర లేచేస్తా అని కాదు..లేవకపోఅవటం లో నా తప్పు లేదు అని చెప్పటం అనమాట. మిగిలిన 6 నెలల కాలం లో వారం లో పనికెళ్ళే 5 రోజుల్లో లేవటం పడుకోవటం అనేది మన చేతుల్లో వుండే పని కాదు. ఇంక సూర్యోదయం...సూర్యాస్తమయం లాంటివాటి గురించి అలోచించినట్టు తేల్సినా మా manager కి అనుమానం వచ్చేస్తుంది నేను పని పంపిణీ లో ఎమయినా లోపాలు చేస్తున్నానా అని. వారాంతపు సెలవలు అంటే అయిదు రోజులు వుధ్ధరించేసిన పనికి బోలెడు విశ్రాంతి తీసేస్కోవాలనే బలమయిన అభిప్రాయంతో రోజూ కన్నా ఇంకో రెండు..మూడు..గంటలు(ఇంకా ఎక్కువ లెక్కపెడితే మరీ నా గురించి నిజాలు తెలిసిపోఅవూ...)నిద్దర తీస్తాం కదా అదన్నమాట. ఏంటమ్మా మరీ కబుర్లు చెప్తున్నావ్...మీకు అస్సలు పనీ పాటా లేకుండా ఆఫీసుల్లో ఆడుకుని వచ్చే రోజులు బోల్డుంటాయని మాకు తెలీదనుకున్నావా అనేస్తున్నారా...అదే మరి...అలా మధ్యలో పని లేని రోజుల్లో అలవాట్లు మార్చేస్కుంటే హఠాత్తుగా పనొచ్చి మీద పడ్డప్పుడు కష్టం కదా అని సమయ పాలనలో మార్పులు చెయ్యబడవ్. చూసారా eమత ముందు చూపో ... :)

ఇంతకీ ఇంత సుత్తి ఎందుకు చెప్తున్నా అనే కదా మీ అనుమానం...వస్తున్నా అక్కడికే వస్తున్నా...మొన్న మనవాళ్ళు ఆడిన world cup final మాకు ఇక్కడ తెల్లవారుఝామున 4:00 గంటలకి మొదలు. ముందు రోజు నీలం రంగు వస్త్రాలని ధరించి భారత జట్టుని ప్రోత్సహించవలసిందొహో అని లేఖలు పంపినా...గాడిద గుడ్డేం కాదూ...అని తీసి పడేసి పైగా శ్రీలంక జట్టు వాళ్ళు వేస్కునే ముదురు నీలం రంగు jeans వేస్కుని మరీ office కి వెళ్ళిన నేను, ఆ... అంత పొద్దున్నే ఎవడు లేస్తాడూ చూస్తే రెండో innings చూస్తా అని friends దగ్గర బింకాలు పోయిన నేను, నాలుగింటికి అల్లారం పెట్టుకుంటున్న మా వారిని చూసి పరీక్షలప్పుడు ఎప్పుడైనా ఇంత tension పడ్డారా అని వెక్కిరించిన నేను...పొద్దున్నే జనగణమణ వినపడగానే, లోపలెక్కడో ఓ మూల నిద్దరోతున్న నా లోపలి Indian ఒక్కసారిగా మత్తువదిలి ఒక్కటివ్వడంతో...లేచి హాల్లోకి పరిగెట్టా... ఒక 15 నిమిషాలు చూసి వచ్చి మళ్ళీ పడుకుందాం లే అని బధ్ధకం వదలని నా మనసుకి నచ్చచెప్తూనే computer ముందు చతికిల పడ్డాను. ఇంచుమించు అయిదేళ్ళ తర్వాత మళ్ళీ ఇదే చూడటం కిరికెట్టు ( మా మామ్మ అలాగే అంటుంది మరి). మనవాళ్ళు నేను చూడటం మానేసాక ఇంతలా improve అయిపోయారా అనుకుంటూ అలాగే చూస్తూ వుండిపోయాను. ఇంక అంత బాగా ఆడుతుంటే నా అతిప్రియమైన నిద్దరని కూడా నాకు తెలియకుండానే మర్చిపోయా. ఇంక ఎలాగూ లేచాం కదా అని అయిదున్నరకి స్నానం చేసేసి దేముడి దగ్గర దీపం పెట్టేస్కుని, పన్లో పని భారత్ నెగ్గెయ్యాలని కూడా దేవుడికి వినతి పత్రం సమర్పించేసి(చిన్నప్పుడు ఇలాగే India నెగ్గాలని, నచ్చిన cinema వస్తున్నప్పుడు power cut అవ్వకూడదని దణ్ణాలు పెట్టేస్కుంటూ వుండేదాన్ని...ఇంకా ఆ అమాయకత్వం ఎక్కడో బతికే వుందనుకుంటా)..టిఫినూ కాఫీ తయారు చేసేసే సరికి...ఆరు...అప్పుడు కిటికీ లోంచి ఎర్రటి ఆకాశం రారమ్మని అని పాట మొదలెట్టింది...ఆట ఎంత రసవత్తరం గా వున్నా...మళ్ళీ ఈ అవకాశం ఎప్పటికి వస్తుందో అని నా కల సాకారం చేసేస్కున్నా...అదన్నమాట విషయం...ఈ శనివారం వుదయం 28 ఏళ్ళ భారత జట్టు ఎదురుచూపులేకాదు...నా కలా(ఎన్నాళ్ళు గా ఎదురుచూస్తున్నానో సరిగ్గా గుర్తు లేదు)..మా వారి కల కూడా నిజమైపోయాయ్...మధ్యలో మా వారి కల ఏమిటా అనుకుంటున్నారా...పెళ్ళవ్వగానే పెళ్ళాం అనబడేది పొద్దున్నే ఆయనగారు లేచేసరికి తలకి పిడప పెట్టేస్కుని(స్నానం చేసైనా కావొచ్చు, చెయ్యకుండానైనా కావొచ్చు) చేతిలో వేడి వేడి coffee cup తో చిరునవ్వులు వొలకపోస్తూ సుభోదయాలు చెప్పేస్తుందనేది ఆయన కల(తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తే అలాంటి కలలే వస్తాయి మరి)...ఆరింటికి టిఫెనూ, కాఫీ చేతిలో పెట్టేసరికి...ఈరోజు నువ్వేమన్నా పట్టించుకోను లాంటి వరాలిచ్చెయ్యటానికి కూడా సిధ్ధపడిపోయారు పాపం.

ఇంతకీ మర్నాడు ఎన్నింటికి లేచావ్ అంటారా...అలాంటి పన్లు అప్పుడప్పుడూ చేస్తేనే అంత సంతోషం, ఆశ్చర్యం, ఆనందం లాంటి అనుభూతులన్నీ కట్ట కట్టుకుని వస్తాయి...రోజూ చేసేస్తే అలవాటైపోయి బోరు కొట్టెయ్యదూ...

6 comments:

V.Venkata Pratap said...

సోదరిKI ఆశీస్సులు
నాకైతే బ్లాగ్ నిర్మాణం కుదరదు.మా స్టూడెంట్స్ అడిగితె ఒక బ్లాగ్ create చేశాను. కానీ trail and error method లో ఏదో చేస్తూ వస్తున్నాను. సరే మన తెలుగు బ్లాగులు చుస్తే ఏదైనా క్రొత్త ఆలోచనలు వస్తాయని కొన్ని బ్లాగులు చూస్తూ వస్తూ మీబ్లాగ్ దగ్గర ఆగిపోయాను. "ఎన్నాళ్ళో వేచిన ఉదయం" అలా పైపైన చూడాలని ఉద్దేశ్యంతో మొదలుపెట్టాను.కానీ అది చివరివరకు నన్ను చదివించింది.అంతేనా "కధ మళ్లీ మొదలైనది." ఆకులో ఆకునై" ఇంకా వరసే. .
- - - -బావ గారు మీకు ఒక్కసారే మహిలదినోత్సవ శుభాకాంక్షలు చెబితే మీరు మాత్రం వారికి 365 రోజులు చెబుతున్నారన్నమాట- వూహ ఎంత బాగున్నదండి. సంతోషం స్పురిత గారు....... ఉంటాను.......http://tellenglish.blogspot.com/

మనసు పలికే said...

హ్మ్మ్.. మొత్తానికి అలా ఒక్కసారిగా మూడు కలలు నిజమైపోయాయనమాట:) సంతోషం స్ఫురిత గారూ:))
టపా చాలా బాగుంది..

హను said...

nice... mee visleshaNa bagumdi....

sphurita mylavarapu said...

ప్రతాప్ గారు, నా రాతలు మీకు అంతగా నచ్చినందుకు చాలా సంతోషం. మీరు సోదరి అని సంబోధించడం చాలా నచ్చింది. ధన్యవాదాలు
మనసుపలికే, హను...ధన్యవాదాలు

Jai Telangana said...

Spurita Ji,

Namaste@. manchi gundi madam mee posting. Videsam la vuntu gooda mana deseeya bhasha nu, aata nu, ginta sraddaga choosina ramte chaana samtoshamesindi. Anninti kanna chaaana chakkam ga varnimchundru, gadi manchi gundi.

jayakrishna said...

Very good . chala baga rasaru