8/12/10

నా మనసుకి మరో ప్రపంచం కావాలి


గుండె నుండి పొంగే నవ్వు కావాలి
స్వేఛ్ఛా విహంగం రెక్కలు కావాలి
అత్మీయత నిండిన పలకరింపు కావాలి
నిజం నిండిన మాట కావాలి
నేనున్నాననే తోడు కావాలి
ప్రకృతిని ఆస్వాదించే సమయం కావాలి
ఒత్తిడి తెలియని ఉద్యోగం కావాలి
పోటీ పడని సహోద్యోగి కావాలి
పోలిక ఎరుగని స్నేహం కావాలి
అంతస్తు పట్టని బంధం కావాలి
సహజత్వం నిండిన మనిషి కావాలి
అబధ్ధం తో అవసరం లేని బాధ్యత కావాలి
అవసరంతో పని లేని నమ్మకం కావాలి
గుప్పిట ముయ్యని మనసు కావాలి
నా మనసుకి మరో ప్రపంచం కావాలి


14 comments:

Indian Minerva said...

చాలా బాగుంది... మీవన్నీ చదువుతున్నాను.

Sai Praveen said...

చాలా బాగుంది.

nagarjuna said...

>>స్వేఛ్ఛా విహంగం రెక్కలు కావాలి
>>ప్రకృతిని ఆస్వాదించే సమయం కావాలి

చాలాబాగా రాసారు

sudha said...

హా...శ్చర్యం....నాకూ ఇవే కావాలి.....
మీకు దొరికితే నాకూ చెప్పండేం...

రవిగారు said...

ఆ భగవంతుడి కి కూడా మీరు కోరినవన్నీ దొరుకుతాయా ?
అంటే అనుమానాస్పదమే

మనసు పలికే said...

స్ఫురిత గారు, చాలా బాగుందండీ మీ కవిత, దానిలో దాగున్న మీ భావాలు..:) నిజమే రవి గారు అన్నట్లు, ఆ భగవంతుడికైనా అవన్నీ దొరకడం కష్టమే.. కానీ మనకి ఏం కావాలో తెలుసుకోడం తప్పు కాదు కదా.

Rachana said...

సహజత్వం నిండిన మనిషి కావాలి
అబధ్ధం తో అవసరం లేని బాధ్యత కావాలి


చక్కని ఉహ

ఈ సమాజానికి మీలా ఆలొచించె మనసు కావలి

Manasa said...

Eee rojullo..ivi dorike adrustam dadapu lenatle..!

I liked each and every sentence of yours..

gunde nundi ponge navvu
nijam nindina mata
polika erugani sneham
antastu pattani bandam
sahajatwam nindina manishi

ivi matrame kavalsina vallaku
nachina manushulato matrame undevallu

ee rojullo migiledi ontaritanam matrame..

enta bhavam to spandana to rasaru meeru....naku chala chala nachindi..

can I make friendship with you please..Manasa!

మాలతి said...

ఇలాటి ఆర్ద్రత గల మనసుండడమే చాలు ప్రస్తుతానికి :)).

hanu said...

చాలా బాగుందండీ మీ కవిత.... nice one

Chandu said...

మాకు మటుకు
మీ నించి ఇలాంటి లేఖలు తరచుగా కావాలి
అవి రాసే తీరిక మీకు కావాలి
మాకోసం ఐనా సరే మీరు చేసుకోవాలి

ప్రణవ్ said...

'ప్రకృతిని ఆస్వాదించే సమయం కావాలి
ఒత్తిడి తెలియని ఉద్యోగం కావాలి'
ఇవి నాకూ కావాలి. చాలా బాగుంది!

Sree said...

ee madhya raayatledu entandi.. how have you been? ee month blog-a-thon, a post a day cheyya daaniki prayatniste nenu chaala santoshistaa..

సత్య said...

చదవడానికి నాకిలాంటి కవితే కావాలి!


సత్య