4/13/10

నా కళా పోషణ

చిన్నప్పుడు నేను ఎక్కడైనా కాగితం కనబడితే చాలు బొమ్మలు వేసేస్తూ
వుండేదాన్ని. మా అమ్మ చేత అక్షింతలు కూడా వేయించుకుంటూ ఉండేదాన్ని తెల్ల
కాగితాలన్నీ తగలేస్తున్నానని. Computer చూడగానే నాకు అందులో నచ్చినది
Paint Brush. కాగితాలు వృధా కాకుండా ఎన్ని బొమ్మలైనా వేస్కోవచ్చుకదా
అన్నదే నాకు Computer గురించి పెద్దగా ఏమీ తెలియనప్పుడే తెలిసిన మొదటి
ఉపయోగం. తర్వాత్తర్వాత ఆ మహాసముద్రం లోనే ఈదుతున్నా ఇప్పటికీ ఆ బొమ్మలు
వేసే అలవాటు పోక(మా అమ్మ భాష లో పైత్యం)అప్పుడప్పుడూ, ఇంకా చెప్పాలంటే ఈ
Computer కనిపెట్టినవాడు కనపడితే కాల్చి పారెయ్యాలి అనిపించినప్పుడు ఒక
బొమ్మ వేసి Save చెస్తూ వుంటాను.

నాకు ఇవాళ మధ్యాహ్నం ఒక మహత్తరమైన అలోచన(నా దృష్తిలో)వచ్చింది.
బ్లాగ్లోకం వున్నది మన కళల్ని ప్రపంచానికి చాటడానికే(ప్రపంచం మీద
రుద్దడానికే) కదా అని. రావటమే తణువు నా చిత్రకళా ప్రదర్శన
పెట్టేస్తున్నా. ఇక మీదే అలశ్యం.

గమనిక: ఫ్రవేశం వుచితం.


మురళీ గానామృతం



కన్నీళ్లు కూడా వరమే


దారిచూపే దివ్వె








వెన్నెల్లో ఆడపిల్ల



పూజలు సేయ పూలు తెచ్చాను...


దీపావళి వెలుగులు
హమ్మయ్య అయ్యారిరా బాబూ అనుకుంటున్నరా...అక్కడే పప్పులో కాలేసారు...ఇంకా చాలా వున్నాయి. ఇది మొదటి భాగం మాత్రమే...మళ్ళీ కలుద్దాం త్వరలో.










14 comments:

Rani said...

ఇవన్నీ paintbrush లోనే వెశారా? చాలా బావున్నాయండీ :)

Sujata M said...

Sooparu. Please proceed. Nice style.

Phani said...

Beautiful

please continue..

శ్రీలలిత said...

ఎంత బాగున్నాయో... ఎలా వేసారో నాకు నేర్పరూ...

sphurita mylavarapu said...

రాణి గారు, సుజాతగారూ నా బొమ్మలు నచ్చినందుకు చాలా సంతోషం.
రాణి గారు, paint brush లో వేసాక, photoshop లో కొంచెం మెరుగులు దిద్దాను.

sphurita mylavarapu said...

ఫణి గారూ Many many thanks
శ్రి లలిత గారు మరి ఎప్పట్నుండీ మొదలు పెడదాం క్లాసులు

మురళి said...

'కన్నీరు' బొమ్మ నన్ను చాలా వెనక్కి తీసుకెళ్ళి పోయిందండీ.. కాలేజీలో క్లాసవుతుంటే నేను లెక్చరర్ కేసి చూస్తూనే యధాలాపంగా ఇదే (లాంటి) బొమ్మ నోట్ బుక్ లో గీసేసే వాడిని.. మిత్రులు కొందరు 'లవ్ ఫెయిల్యూర్' అని అపార్ధం చేసేసుకున్నారు కూడాను.. నా ఫ్లాష్ బ్యాక్ కొంచం ఆపితే, మీ బొమ్మలు చాలా బాగున్నాయ్.. పెయింట్ బ్రష్ లో బొమ్మలేయాలన్న ఉత్సాహాన్ని కలిగించాయి.. మీరిలాగే కంటిన్యూ అయిపోండి.. అన్నట్టు కృష్ణుడి నెమలీక కొంచం ప్రత్యేకంగా నచ్చింది నాకు :-)

sphurita mylavarapu said...

అయ్యో మురళి గారూ మీ కన్నీరు ఆ lecture వినలేక అని మీ స్నేహితులకి అర్థం కాలేదన్నమాట. మీ అభినందనలకి నా కృతజ్ఞతలు. నా బొమ్మలు inspire కూడా చేస్తున్నాయని తెలుసుకుని చాలా సంతోషించాను.

నేస్తం said...

స్పురితా ఎంత బాగున్నాయో.. నాక్కూడా నాక్కూడా నేర్పించవా

విశ్వ ప్రేమికుడు said...

చాలా బాగున్నాయి. paint లో కూడా ఇంత మంచి బొమ్మలు వేయవచ్చా. నేనూ try చేస్తా. :)

Padmarpita said...

చాలా బావున్నాయండీ....

Unknown said...

superb pictures, i too will try

నేను said...

Nice pics. Raadhaa krishnula pic chaalaa baavundandi.

Keep posting more.

Prabha said...

Eswari..asalu..aa computer udyogam vadilesi..ee painting professional ga board petteyachhu..asalu enta bagunnayo nee paintings..and creativity..hats off yaar